YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తీసుకున్న లంచం తిరిగిచ్చేస్తా రైతుల ఆందోళనతో సంతకం చేసిచ్చిన తహసీల్దారు

తీసుకున్న లంచం తిరిగిచ్చేస్తా రైతుల ఆందోళనతో సంతకం చేసిచ్చిన తహసీల్దారు

తీసుకున్న లంచం తిరిగిచ్చేస్తా
రైతుల ఆందోళనతో సంతకం చేసిచ్చిన తహసీల్దారు
రూ.పది లక్షల వరకు వసూలు చేసినట్లు రైతుల  ఆరోపణ
కొమురంభీం అసిఫాబాద్ 
చింతలమనేపల్లి మండల రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఖాజా నియజుద్దీన్ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అతడు బదిలీ పై వెల్లుతుండటం తో  బయటకు వస్తున్నాయి...ఆయనో రెవెన్యూ అధికారి. రైతుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన ఆ అధికారి.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంతలో వేరే మండలానికి బదిలీ అయ్యారు. విషయం తెలిసిన రైతులు ఆయనను నిర్బంధించి తమ సొమ్ము ఇవ్వాలని పట్టుబట్టారు. చేసేదేమీలేక చివరకు.. తన వసూళ్ల చిట్టాను రాసిపెట్టి.. ఫలానా తేదీలోపు తిరిగి ఇచ్చేస్తానని సంతకం పెట్టి మరీ హామీ ఇచ్చారు. ఈ సంఘటన కుమురం భీం జిల్లా చింతలమానెపల్లిలో చోటు చేసుకుంది. చింతలమానెపల్లి తహసీల్దార్ ఖాజా నియాజుద్దీన్ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టరు బుధవారం అతడిని జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. ఏం చేయాలో తోచక నియాజుద్దీన్ తాను హామీ ఇచ్చిన వారి పనులు చేసేద్దామని బుధవారం రాత్రంతా కార్యాలయంలోనే ఉండి ఫైళ్లు తిరగేశారు. తెల్లారేసరికి కొత్త అధికారి వచ్చి విధుల్లో చేరారు. తాము డబ్బులు ఇచ్చిన అధికారి వెళ్లిపోతున్నాడని తెలిసి గురువారం ఆ కార్యాలయానికి చేరుకున్న వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా పనులైనా చేయాలని పట్టుబట్టారు. ఒక్కో రైతు నుంచి రూ. 10,000 నుంచి రూ. 70,000 వరకు వసూలు చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనను అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరికి తహసీల్దారు ఎవరికి ఎంతివ్వాలో తెల్లకాగితంపై రాసి 18వ తేదీలోగా తిరిగి చెల్లిస్తానంటూ సంతకం చేసి ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళన విరమించారు.

Related Posts