శ్రీశైలం లో తగ్గుతున్న నీటిమట్టం
కర్నూలు
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 30,612 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 852.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం : 85.7503 టీఎంసీలకు చేరుకుంది.