కరోనా టెస్ట్. అంటూ లైంగిక దాడి
ముంబై,
కరోనా టెస్టు కోసం ల్యాబ్కు వచ్చిన యువతిపై టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. జననాంగాల వద్ద శాంపిల్ తీసుకుంటే కరోనా ఫలితం కచ్చితంగా వస్తుందని నమ్మించాడు.కరోన టెస్ట్ కోసం ల్యాబ్కు వచ్చిన యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. అమరావతి పట్టణానికి చెందిన యువతి ఓ సంస్థలో పనిచేస్తోంది. ఇటీవల ఆమె సహోద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఓ ల్యాబ్కు వెళ్లగా అక్కడ పనిచేసే ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. కరోనా టెస్ట్ ఫలితం కచ్చితంగా రావాలంటే జననాంగం వద్ద కూడా శాంపిల్ సేకరించాలని ఆమెను నమ్మించాడు.యువతి సరేననడంతో ఆమె జననాంగం వద్ద శాంపిల్ సేకరిస్తున్నట్లు నటిస్తూ పాడుపని చేశాడు. ఇంటికెళ్లిన తర్వాత యువతి ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో అతడు షాకయ్యాడు. తనకు తెలిసిన డాక్టర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా కరోనా శాంపిళ్లను జనాంగం నుంచి సేకరించరని ఆయన స్పష్టం చేశారు. దీంతో తనను ల్యాబ్ టెక్నీషియన్ మోసం చేశాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు ఇంకెవరిపైనా ఇలాంటి పైశాచికానికి పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
==================