కరెన్సీతో అమ్మావారి ఆలంకరణ
విశాఖపట్నం
శ్రావణం సందర్బంగా విశాఖలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.ఏటా తెలుగు ప్రజల పూజలకు ప్రసిద్ది చెందిన శ్రావణ శుక్రవారం పర్వదినంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది.మాసాల్లో శ్రావణమాసానికి మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు.కానీ కరోనా ప్రభావంతో శ్రావణ మాసంలో అమ్మవారి దేవాలయాలు కళ తప్పాయి.విశాఖలో ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి.ఉత్తరాంధ్ర ప్రజల ఆరాద్య దైవం శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవాస్ధానంలో పూజలన్పీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.కరోనా ప్రభావంతో భక్తులు రాకపోవడంతో ఆలయ సిబ్బంది అమ్మవారికి పూజలు నిర్వహించారు.మరోవైపు కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.ఈ సందర్బంగా అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలకరించారు.దగదగలాడే కరెన్సీ నోట్ల మద్య అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు.శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే మహిళలు తమ గృహాల్లోనే పూజలు కొనసాగిస్తున్నారు.దీంతో భక్తుల రాకతో కిటకిటలాడే దేవాలయాన్నీ నిర్మానుష్యంగా మారాయి.