శానిటైజర్ త్రాగి 9మంది మృతి
దర్శి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని కురిచేడు లో గత పది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయగా మద్యం ప్రియులు మద్యం దొరకక, మత్తు కోసం శానిటైజర్ త్రాగి 9మంది మృతి చెందగా, మరికొందరు అస్వస్ధతకు గురిచేందారు. ఈ విషయం పై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ కురిచేడుకీ వెళ్లి
సంఘటన విషయాలు తెలుసుకొన్నారు. ఈ సంఘటన పై పోలీసులు ఇది శానిటైజర్ త్రాగరా లేదా కల్తీసారా త్రాగారా అని దర్యాప్తు చేపట్టారు. దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ కురిచేడు లో మృతులకు నివాళ్లు ఆర్పిచారు.వారి కుటుంసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ విషాదo పై ఎమ్మెల్యే
మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ మద్యానికి బానిసై కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తో చర్చించారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు.