YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాయి ప్రతాప్... ఇప్పుడేం చేయాలి

సాయి ప్రతాప్... ఇప్పుడేం చేయాలి

కడప, ఆగస్టు 3, 
అవును! ఒకే ఒక్క అడుగు రాజ‌కీయ నేత‌ల‌ను ఎటువైపైనా తీసుకువెళ్తుంది.ఆ అడుగు స‌రైన స్టెప్ అయితే.. రాజ‌కీయాల్లో ఉన్నత‌స్థాయికి తీసుకువెళ్తుంది. అదే స్టెప్ రాంగైతే.. మాత్రం స‌ద‌రు నేత‌ల‌ను కొన్ని ద‌శాబ్దాల పాటు కోలుకోలేని స్థితికి చేరుస్తుంది. ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మిత్రుడు, రాజంపేట మాజీ ఎంపీ అన్నయ్యగారి సాయిప్రతాప్ ఎదుర్కొంటున్నారు. వైఎస్ జీవించి ఉన్న స‌మ‌యంలో త‌న‌కు తిరుగులేని నాయ‌కుడిగా సాయిప్రతాప్ చ‌క్రం తిప్పారు. 1989నుంచి వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న దూసుకుపోయారు. బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గం ఉన్న క‌డ‌ప జిల్లాలో బ‌లిజ వ‌ర్గానికి చెందిన సాయిప్రతాప్‌ను దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఎంతో ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చారు.నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రితోనూ క‌లివిడిగా తిరిగ‌డంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన నాయ‌కుడిగా కూడా సాయిప్రతాప్ పేరు తెచ్చుకున్నారు. 1989, 1991, 1996, 1998 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ వ‌రుసగా విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణంతో సాయిప్రతాప్ ప‌రిస్థితి డౌన్ ట్రెండ్‌కు దారితీసింది. దీనికితోడు 2014లో రాష్ట్ర విభ‌జ‌న కూడా ఆయ‌న‌ను రాజ‌కీయంగా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతిన‌డంతో ఆ పార్టీకి దూరంగా ఉన్న సాయిప్రతాప్‌.. అనూహ్యంగా వేసిన స్టెప్‌.. ఇప్పుడు ఆయ‌న‌ను చర్చనీయాంశం చేసింది.
వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడైన‌.. సాయిప్రతాప్ కు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ రెడ్ కార్పెట్ ప‌ర‌వాల‌ని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఒక‌టికి రెండు సార్లు ఆయ‌న‌కు ఆహ్వానం పంపించారు. అయితే, సాయిప్రతాప్‌.. అనేక త‌ర్జన భ‌ర్జన త‌ర్వాత వైఎస్సార్ సీపీలోకి రాకుండా టీడీపీలోకి జంప్ చేశారు. అప్పట్లో చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వ‌స్తారనే భారీ ప్రచారం సాయిప్రతాప్‌పై తీవ్రంగా ప‌నిచేసింది. దీంతో ఆయ‌న వైఎస్సార్ సీపీలోకి కాకుండా టీడీపీలోకి జంప్ చేశారు. అయితే, చంద్రబాబు అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.దీంతో సాయిప్రతాప్ రాజ‌కీయాలు కూడా మైన‌స్ అయ్యాయి. అదే, సాయిప్రతాప్ జ‌గ‌న్ చెంత‌కు చేరి ఉంటే.. ఆయ‌న‌కు మంచి గౌర‌వంతోపాటు.. ప్రభుత్వంలోనూ కీల‌క‌మైన ప‌ద‌వి సొంత‌మై ఉండేది. సాయిప్రతాప్ టీడీపీలోకి వెళ్లడం వెన‌క మ‌రో క‌థ కూడా ఉంద‌ని టాక్‌. ఆయ‌న‌కు ప‌ట్టున్న రాజంపేట‌, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాల్లో శ్రీకాంత్‌రెడ్డి, అమ‌ర్నాథ్ రెడ్డి ( మాజీ ఎమ్మెల్యే) లాంటి బ‌ల‌మైన నేతలు అప్పటికే పాతుకు పోయారు. ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన రాజంపేట సీటులో మిథున్‌రెడ్డి పాగా వేశారు. దీంతో చంద్రబాబు రాజంపేట సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన మేర‌కే ఆయ‌న టీడీపీలో చేరార‌ని టాక్‌? అయితే ఎన్నిక‌ల టైంలో ఆయ‌న సాయిప్రతాప్‌కు షాక్ ఇచ్చి అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే డీకే స‌త్యప్రభ‌కు సీటు ఇచ్చారు. ఏదేమైనా సాయిప్రతాప్ వేసిన రాంగ్ స్టెప్‌.. ఆయ‌న పొలిటిక‌ల్ లైఫ్‌ను బ్రేక్ చేసింద‌నే చెప్పాలి.

Related Posts