మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకొని మనం సంతృప్తి పడతాము.కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం.
ఇక్కడ వేదాంత విషయం ఏమిటంటే “దేహమే దేవాలయం” అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు.
నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాసశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.
ఈ వేదాంతాన్ని గ్రహించి మిత్రులారా మీరు అందరు ఇప్పటి నుండి ఈ రోజు నుండి దేవాలయానికి పోయే ఆ సమయాన్ని మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వార మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను ఇవ్వండి. అదియే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్నా లింగాన్ని దర్శించడం అంటే మనం మన హృదయాంతరంలో వున్న ఆ సర్వేస్వరున్ని ధ్యానం ద్వార పరిపూర్ణ (సంపూర్ణ) దర్శనం
(ఆత్మసాక్షాత్కారం.)..........
చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన పెద్దలు అలోచించి అలా చేయవలసి వచ్చింది.,.................
ఓం తత్సత్