YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

హైద్రాబాద్, ఆగస్టు 3,
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న ఉన్న వేళ ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను మంత్రి వర్గంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయం, నియంత్రిత సాగు, కరోనా వల్ల విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అసలే వర్షకాలం... ఆ పై కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కానీ లాక్ డౌన్ మళ్లీ విధించే పరిస్థితి లేనందున ఏం చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
కొత్త సచివాలయ ఆకృతిపై పలు మార్పులను కూడా కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సచివాలయం నిర్మాణంపై సీఎం సుదీర్ఘ సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వల్ల గత అకడమిక్ ఇయర్ పరీక్షలు లేకుండానే కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు పాస్ చేయించిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో.. ఇంటర్నల్స్ ఆధారంగా పాస్ చేయించారు. తెలంగాణ, ఏపీ కాక దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాన్నే అవలంభించారు. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలచేశారు. అలాగే అన్ లాక్ 3 సడలింపులు, విద్యాసంస్థలు తెరిచే అంశాలు, అంతర్రాష్ట్ర వాహనాలకు అనుమతి వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

Related Posts