తిరుపతి ఆగస్ట్ 3
శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ జోన్ ను ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా పాజిటివ్ అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అయన అన్నారు. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో అవసరానికి అనుగుణంగా 5 చొప్పున ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని అయన అన్నారు. కరోనా బాధితుల పట్ల ముందస్తుగా ఆలోచించి చర్యలు చేపడుతున్న సర్వీసెస్ పట్ల ఐఎంఏ వైద్య బృందం హర్షం వ్యక్తం చేశారు.