YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీటెక్ రవి రాజీనామాపై చర్చోపచర్చలు

బీటెక్ రవి రాజీనామాపై చర్చోపచర్చలు

కడప, ఆగస్టు 4, 
బీటెక్ రవి… అసలు పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీటెక్ రవి రాజీనామా ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కు బీటెక్ రవి పంపారు. అయితే ఆ రాజీనామా ఆమోదం పొందుతుందా? లేదా? అన్నది పక్కన పెడతే బీటెక్ రవి ఎందుకు రాజీనామా చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. తన రాజీనామాకు కారణం బీటెక్ రవి చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు.అయితే బీటెక్ రవి రాజీనామాకు మూడు రాజధానుల నిర్ణయం కానే కాదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. నిజానికి కడప జిల్లాకు చెందిన బీటెక్ రవికి, మూడు రాజధానులకు సంబంధం లేదు. ఇటీవల పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీటెక్ రవి సమర్థించారు. రాయలసీమకు మేలు జరుగుతున్న ప్రాజెక్టును తాము స్వాగతిస్తున్నట్లు బీటెక్ రవి ప్రకటించారు. అంటే రాయలసీమ ప్రయోజనాల విషయంలో నెలన్నర క్రితం కూడా పార్టీని లెక్క చేయని బీటెక్ రవి ప్రస్తుత రాజీనామాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిజానికి బీటెక్ రవి కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైెఎస్ వివేకా మీద గెలిచారు. 38 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2017లో ఈ ఎన్నిక జరిగింది. బీటెక్ రవి ఎమ్మెల్సీగా మరో మూడేళ్లు కొనసాగుతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కడప స్థానిక సంస్థల ఎన్నికలకు తిరిగి ఉప ఎన్నిక జరిగితే అది అధికార పార్టీకి దక్కుతుందన్నది అందరికీ తెలిసిందే. అయినా రాజీనామా చేశారంటే కేసులకు భయపడి బీటెక్ రవి రాజీనామా చేశారన్న వాదన ఒకవైపు ఉంది.మరోవైపు శాసనమండలి ఛైర్మన్ తమ వారు కావడంతో రాజీనామా ఆమోదించరన్న ధైర్యంతోనే బీటెక్ రవి ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ కూడా బలంగా ఉంది. చంద్రబాబు చెప్పడంతోనే బీటెక్ రవి రాజీనామా డ్రామా ఆడుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జగన్ సొంత జల్లా నుంచే అమరావతి తరలింపునకు వ్యతరేకంగా రాజీనామా చేశారన్నది జాతీయ స్థాయిలో చర్చ కావాలని చంద్రబాబు బీటెక్ రవి చేత రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారన్న విమర్శలూ లేకపోలేదు.

Related Posts