విశాఖపట్టణం, ఆగస్టు 4,
వాసుపల్లి గణేశ్‌కుమార్ తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో పెద్ద దిక్కుగా మారారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలే పార్టీకి నగరంలో ఊపిరి పోస్తున్నాయి. గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేసి అనంతరం తెలుగుదేశం పార్టీలో చెరిన ఆయన.. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.2019ఎన్నికల్లో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు. ఆ నలుగురూ సిటీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలోని వారే. వారిలో విశాఖ దక్షిణం నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్ ఒకరు. తూర్పు నియోజకవర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమం నుంచి గణబాబు గెలిచారు.పేరుకు సిటీలో నలుగురు ఎమ్మెల్యేలున్నా… ఎవరికి వారు ఎమునా తీరేగా ఉంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంత వరకూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నది లేదు. అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత కానీ, అయ్యన్నపాత్రుడిపై కేసులు పెట్టినప్పుడు కానీ గంటా అసలు ఆ సమీపానికి కూడా రాలేదు.ఇదే సమయంలో విశాఖ నగరంలో వాసుపల్లి ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు ఉన్నా సరే భౌతిక దూరం పాటిస్తూ తన నిరసన తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ సీనియర్లు కాడిని వదిలేశారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అయ్యన్నపాత్రుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గత 15 రోజులలో రెండు సార్లు అరెస్టు అయ్యారు బండారు సత్యనారాయణ. ఇక ఎమ్మేల్యేలుగా ఉన్న గణబాబు, వెలగపూడి తమ తమ నియోజకవర్గాల్లో మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారుగతంలో మాజీ నగర అధ్యక్షుడు ఎస్ఏ రెహ్మాన్‌తో వివాదం వల్ల ఏకంగా సంవత్సరం పాటు టీడీపీ పార్టీ కార్యాలయానికే రాలేదు వాసుపల్లి. ఒకవైపు ప్రతిపక్షంగా అధిష్టానం ఎలాంటి నిరసన కార్య్రకమం చేపట్టాలని పిలుపునిచ్చినా అటు నగర అధ్యక్షుడి హోదాలోనూ ఇటు ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారు వాసుపల్లి.అన్నా క్యాంటీన్ల మూసివేత, ఇసుక కొరత వంటి సమస్యలపై పార్టీ నాయకత్వంతో పని లేకుండా తన నియోజకవర్గంలోనే కార్యక్రమాలు నిర్వహించారు. రెహ్మాన్ వైసీపీలోకి వెళ్లడంతో మళ్లీ అర్బన్ పార్టీ బాధ్యతలు తీసుకున్న వాసుపల్లి… తనదైన శైలిలో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.పార్టీ హై కమాండ్ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నా అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు పార్టీలో భిన్న ధ్రువాలుగా, బద్ధశత్రువులుగా ఉన్న మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులతో సన్నిహితంగానే ఉంటారు తప్పితే ఏ ఒక్కరి వర్గంగానూ ముద్ర పడకుండా తనకు తానే ఏక్ నిరంజన్‌గా పార్టీలో పేరు తెచ్చుకున్నారు