YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ రావు పేరు

డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ రావు పేరు

 డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్రావు పేరును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇందుకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు,సాగునీరు అందించేందుకు ఈ పథకం ప్రారంభించారు. ప్రాజెక్టుకు విద్యాసాగర్ పేరు పెడుతూ  దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణించాలని నీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
 సాగునీటి రంగలో నిపుణులైన ఆర్. విద్యాసాగర్ రావు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంపై జరిగిన అన్యాయంపై ఎలుగెత్తి చాటారు. పలు వేదికలపై తెలంగాణ అన్యాయాన్ని ప్రత్యక్షంగా చూపారు. నీటిపారుదల శాఖలో ఉన్నతాధికారి స్థానంలో ఆయన.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు ఇస్తూ సందేహాలను నివృత్తి చేసేవారు. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది. ఆయన కల కన్నట్లుగానే సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఆయన పుట్టిన నల్గొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆర్. విద్యాసాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది మృతిచెందారు. నల్గొండ జిల్లాకు చెందిన విద్యాసాగర్రావును స్మరిస్తూ ఆ జిల్లాలో నిర్మితమవుతున్న డిండి ప్రాజెక్టుకు ఆర్. విద్యాసాగర్రావు ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. విద్యాసాగర్ రావుకు ఇది సరైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉండేందుకు, బావి తరాలకు స్పూర్తినిచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందన్నారు. సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీటి పారుదల శాఖ తరుఫున, ఇంజనీర్లు, అధికారుల తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు

Related Posts