మంత్రాలయం ఆగస్టు 4,
వేదమంత్రాల సాక్షిగా పూర్వా ఆరాధన బృందావనానికి విశేష పంచామృతాభిషేకం బంగారు పల్లకి లో ఉత్సవ మూర్తి సప్త రాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం పూర్వ ఆరాధన కార్యక్రమాన్ని పీఠాధిపతుల ఆధ్వర్యంలో శ్రీ మఠం అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు రోజు శాకోత్సవ కార్యక్రమాన్ని వేదమంత్రాల సాక్షిగా పీఠాధిపతులు నిర్వహించారు. మంగళవారం శ్రీ రాఘవేంద్ర స్వామి 349 సప్త రాత్రోత్సవాలలో భాగంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. జలాభిషేకం,క్షీరాభిషేకం , విశేష పంచామృతాభిషేకం గావించి సువర్ణ కవచాన్ని అలంకరించారు. అనంతరం మూల బృందావనానికి పీఠాధిపతులు మంగళహారతులు సమర్పించారు. మూలరామ దేవుళ్లకు పీఠాధిపతులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను బంగారు పల్లకిలో ఆశీనులు గావించి శ్రీ మఠం ప్రాంగణంలో ఊరేగించారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ ఆరాధన కార్యక్రమాలు విశేషంగా జరిగాయి.