భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచంలో స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించిన దార్శనికుడు అంబేద్కర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ హాల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన మహోత్సవ సభ లో అయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ , మేయర్ స్వరూపా , డిప్యూటీ మేయర్ గంపన్న, జేసీ రమామణి , ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీఆర్ దాస్, కార్పొరేటర్ బంగీసుదర్శన్ లు పాల్గొన్నారు. పల్లె మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి దళితులకు న్యాయ పరిస్కారానికి చొరవ చూపింది టీడీపీ యే. అంబెడ్కర్ ఓ సామాజిక విప్లవకారుడు, విశిష్టమైన మేధా సంపన్నుడని కొనియాడారు. జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు.... గొప్పగా ఉండాలి అనే తన మాటలను అక్షరాలు ఆయనను నిజం చేశాయన్నారు. కుల, మత, వర్గ వివక్షత లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందాలన్నదే అంబేద్కర్ ఆశయం. దళితులకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. స్త్రీలకు పురుషులతో సమానం గా ఆస్తి హక్కు, స్థిరా, చరాస్తులకు వారసత్వ హక్కు, జీవన భృతి హక్కు, వితంతువులకు తండ్రి, భర్త ఆస్తిలో హక్కు ను బిల్లులో ప్రవేశపెట్టిన మహనాయకుడు బిఆర్ అంబేద్కర్అని అన్నారు. దళితులకు సముచితమైన న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోరవతో అమరావతిలో 125 ఎత్తైన అడుగుల అంబేద్కర్ విగ్రహం..15 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని అయన తెలిపారు.