YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 200 మంది కరోనా బాధితులు డిశ్చార్జి బాధితులకు ధైర్యం చెప్పిన చెవిరెడ్డి

శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 200 మంది కరోనా బాధితులు డిశ్చార్జి  బాధితులకు ధైర్యం చెప్పిన చెవిరెడ్డి

తిరుపతి ఆగష్టు 4 
శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్-19 ఆసుపత్రి నుంచి 200 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాధితులకు డిశ్చార్జి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు నిరంతరంగా పర్యవేక్షిస్తుండటం పట్ల ఇక్కడ మెరుగైన సేవలు అందాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఒక మారు వైద్య సేవలు పొంది నెగిటివ్ వచ్చిన తరువాత తిరిగి పాజిటివ్ వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తరువాత మరో వారం రోజుల పాటు హోమ్ క్వారం టై న్ లో ఉండాలని సూచించారు. ఆ తరువాత యధావిధిగా తమ పనుల్లో నిమగ్నమ వ్వవచ్చునని తెలిపారు. కరోనా భయం అవసరం లేదన్నారు. అలా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవుపలికారు. బాధితులతో ఆప్యాయంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు.  అనంతరం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 2 వేల నగదును అందజేశారు. బాధితులు చెవిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధితులంతా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వారే. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మీ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts