YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

16న గంటా కొట్టేస్తారు...

16న గంటా కొట్టేస్తారు...

16న గంటా కొట్టేస్తారు...
విజయవాడ, 
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం అయింది. ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది. వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే ఆయన చేరికపై విస్తృత ప్రచారం జరుగుతున్నా.. తేదీపై స్పష్టత లేదు. ముందుగా ఆగస్ట్ 15 అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి 16వ తేదీని ఫిక్స్ చేశారు. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగుతారు. ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం బాటలోనే గంటా కూడా వ్యవహరించనున్నారు. వీళ్ళు ముగ్గురూ అనుచరులతో పార్టీలో చేరినా వైసీపీ మద్దతుదారులుగా వున్నారు. వీరికి వేరే సీట్లు కేటాయించారు. వారిలాగే గంటా కూడా కొంతకాలం వుంటారని భావిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర పార్టీ వ్య‌వ‌హారాలు మొత్తం విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్నాయి. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు సంబంధించి సాయిరెడ్డి చెప్పిందే వైసీపీలో ఫైన‌ల్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. అయితే, విజయసాయికి తెలియకుండా గంటాను పార్టీలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. విజయసాయి కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరిన వేళ ఈ వ్యవహారం మరింత రంజుగా మారింది.
కానీ అలా జరగలేదు. విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన ఓ కీల‌క రాజ‌కీయ మ‌లుపులో విజ‌య‌సాయిరెడ్డి ఇష్టానికి విరుద్ధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటారనే చ‌ర్చ జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ‌ప‌ట్నం ఉత్త‌రం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఆయ‌న గ‌త ఎన్నిక‌ల ముందే రాష్ట్రంలో వైసీపీ వేవ్ న‌డుస్తుంద‌ని ప‌సిగ‌ట్టారు. ఎన్నిక‌ల ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాల‌ని భావించారు. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా ముగిశాయి.టీడీపీ పెద్ద‌లు బుజ్జ‌గించ‌డం వ‌ల్ల చివ‌ర‌కు ఆయ‌న ఆ పార్టీలోనే కొన‌సాగారు.
టీడీపీకి 23 సీట్లు రావడంతో మళ్ళీ గంటా గాలి వైసీపీ వైపు మళ్లింది. కానీ గంటా రాకను జిల్లాలోని వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో పార్టీ నేతలు వెనక్కి తగ్గారు.  భీమిలి నుంచి విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గానికి మారి విజ‌యం సాధించారు.కానీ, పార్టీ ఓడిపోవ‌డంతో ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచే సైలెంట్‌గా మారిపోయారు. పార్టీ వ్య‌వ‌హారాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. వైసీపీ ప్ర‌భుత్వంపై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. పైగా విశాఖ‌ప‌ట్నాన్ని పాల‌నా రాజ‌ధాని చేయాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని టీడీపీ స్టాండ్‌కు వ్య‌తిరేకంగా స‌మ‌ర్థించారు. తాజాగా పాలనా రాజధానిగా విశాఖ ఫిక్స్ అయింది. గవర్నర్ కూడా రాజముద్ర వేయడంతో గంటా వైసీపీలోకి రావడానికి గట్టి ప్రయత్నాలు చేశారు

Related Posts