YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ సెంటర్లలో సీసీ కెమెరాలు

కోవిడ్ సెంటర్లలో సీసీ కెమెరాలు

కోవిడ్ సెంటర్లలో సీసీ కెమెరాలు
అనంతపురం, 
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు సత్వర వైద్య అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. ఇప్పటికే 104 కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. 
ప్రభుత్వం సమాచారం ప్రకారం ఏపీలో తొలుత 108 ఆస్పత్రుల్లో.. ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు,కలెక్టర్లకు సీసీ కెమెరా లింకులు కల్పించనున్నారు. వీరు, ఎప్పటికప్పుడు కోవిడ్‌ బాధితులకు చికిత్సపై నేరుగా పర్యవేక్షణ చేస్తారని, చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు. బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు.ఐసీయూ, నాన్‌ ఐసీయూ, జనరల్‌ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు. కోవిడ్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా మందులు ఇస్తున్నారా భోజనం పెడుతున్నారా ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు. ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు.డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులని, రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను డిస్‌ప్లే బోర్డులో ఉంచనున్నారు. ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్‌ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు.
సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. గత కొద్దినెలలుగా ప్రభుత్వాసుపత్రుల్లో చెప్పుకునే దిక్కులేక, సకాలంలో వైద్యసహాయం అందక ప్రాణాలు హరీ మంటున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్య కాస్తయనా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభావం చూపుతుందని ఆశస్తున్నారు.

Related Posts