YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కోవిడ్-19* *కమాండ్ కంట్రోల్ రూమ్

ఏపీ కోవిడ్-19* *కమాండ్ కంట్రోల్ రూమ్
 

*ఏపీ కోవిడ్-19*
*కమాండ్ కంట్రోల్ రూమ్*
=====================

*ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటిద్దాం-కోవిడ్ ను ఎదుర్కొందాం*

[ *S.M.S.* - *S* oap/Sanitizer, *M* ask, *S* ocial Distance ]

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనికితోడు అన్ లాక్ 3.0 పేరుతో కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. 

ఈ నేపథ్యంలోనే కోవిడ్-19 కేసుల సంఖ్య రోజుకు 50కు పైనే నమోదువుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలు మాస్కు ధరించడం, భౌతిక పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.  మార్కెట్లో మందులు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం

*ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్)*. 

కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది. 

*సబ్సు లేదా శానిటైజర్*

మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 

వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం. 

*మాస్కు ధరించడం*

కోవిడ్ ను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.  

*భౌతిక దూరం*

కోవిడ్ ను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. 

పైన సూచించిన విధంగా ప్రతిఒక్కరూ *ఎస్.ఎం.ఎస్ (సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్)* విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం. కోవిడ్ మహమ్మారిని జయిద్దాం.  
=====================
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*
=========+++++++======
*_వ్యాక్సిన్ రాదు... చికిత్స లేదు : కరోనాపై డబ్ల్యూహెచ్ఓ..._*

_జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కరోనాకు త్వరలోవ్యాక్సిన్ వస్తుందనే ప్రపంచం ఆశిస్తుండగా... అది సాధ్యపడదని, ఇక చికిత్స కూడా లేదని స్పష్టం చేసింది._

_‘ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ సాధ్యం కాదు. భవిష్యత్తులోనూ సాధ్యపడకపోవచ్చు. భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల పైనే ప్రజలు దృష్టి పెట్టాలి. ఆ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సిందే’నని స్సష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది రెండోసారి.  ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడామ్ గిబ్రేయెసస్ కిందటి నెలలో  ఓ సందర్భంలో మాట్లాడుతూ… సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు._

_ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు కూడా._
___________________________
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చేసిన పై హెచ్చరిక లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ

మనం మాత్రం పైన జాగ్రత్తలు తీసుకోకపోతే, వీధిలో ఉన్న కరోనా వ్యాధిని మన చుట్టుపక్కల వారికి అంటించడమే  కాకుండా , కిక్కిరిసిపోయిన ఆసుపత్రులు చుట్టూ మనం కూడా తిరగవలసి వస్తుంది ఇబ్బంది పడుతూ...

మన  కుటుంబం దృష్ట్యా మనం  జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత

 

Related Posts