రూ. 35 రూపాయిలకు కరోనా మందు
చెన్నై,
రోగులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగించే ఫవిపిరవిర్ ఔషధాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సన్ ఫార్మా తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఫవిపిరవిర్‌తో పాటు రామ్‌దేసివిర్ అనే మరో యాంటివైరల్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.సన్ ఫార్మా తీసుకువచ్చిన ఫవిపిరవిర్ ఔషధం పేరు ఫ్లూగార్డ్. దీని ధర రూ.35. 200 ఎంజీ ట్యాబెట్‌కు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఫవిపిరవిర్ ట్యాబ్లెట్ల కన్నా దీని ధర తక్కువ కావడం గమనార్హం. ఈ ట్యాబ్లెట్లు ఈ వారం నుంచే అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.మరోవైపు మరో ఫార్మా కంపెనీ జూబిలంట్ లైఫ్ సైన్సెస్ కరోనా చికిత్సకు వాడే రామ్‌దేసివిర్ ఇంజెక్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని పేరు జూబి-ఆర్. దీని ధర ఏకంగా రూ.4,700. దేశంలో 1000 హాస్పిటల్స్‌కు ఈ కంపెనీ నేరుగానే ఈ వ్యాక్సిన్‌ను అందిస్తోంది. వచ్చే నెల నుంచి కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను రష్యా తయారు చేయనుందని నివేదికలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంటోంది. అలాగే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ఎఫెక్స్ లేవని తెలిపింది.