YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

దర్శనాలకు దూరంగా భక్తులు

దర్శనాలకు దూరంగా భక్తులు

దర్శనాలకు దూరంగా భక్తులు
తిరుమల, 
లాక్‌డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలకు అనుమతించిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి అట. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 46 లక్షలు రాగా.. శ్రీవారికి నేడు 1074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ లెక్కల్ని బట్టి పరిస్ధితులు అర్ధమవుతున్నాయి.. భక్తులు కరోనా భయంతోనే తిరుమల వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. టీటీడీ కూడా కరోనాకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. భక్తులు మాత్రం తిరుమల వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి.అంతేకాదు లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆదాయానికి కరోనా గండి కొట్టింది. గత నాలుగు నెలల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గత నెలల్లో దాదాపు 90లక్షలమంది భక్తులు వెంకటేశ్వరుడి దర్శనభాగ్యం కోల్పోయారు. ఇక టీటీడీ అంచనా ప్రకారం రూ.1100కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తే.. కానీ కేవలం రూ.270కోట్లు మాత్రమే వచ్చింది. అది కూడా రూ.240కోట్లు వడ్డీల రూపంలో వస్తే.. మిగిలిన రూ.30కోట్లు శ్రీవారి హుండీ, భక్తుల దర్శనం ద్వారా వచ్చిన ఆదాయం. అంటే టీటీడీ దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది. తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ తగ్గడం ప్రధాన కారణం.
టీటీడీలో 3.5 కోట్ల లడ్డూ విక్రయాలు తగ్గిపోయాయి. వైరస్ మహమ్మారి కారణంగా తలనీలాలు సమర్పించని భక్తుల సంఖ్య 36 లక్షలు. ఇక టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 3 వేల కోట్లకుపైన ఉంటే.. టీటీడీ వార్షిక బడ్జెట్‌ను తగ్గించే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఆదాయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. అంతేకాదు ఒక నెలలో ఉద్యోగులకు జీతాల విషయంలో ఇబ్బంది తప్పడం లేదు. ఇటు టీటీడీకీ కానుకల రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గింది.. ఆన్‌లైన్ ద్వారా కొందరు భక్తులు మాత్రం కానుకలు చెల్లిస్తున్నా.. అది తక్కువగానే ఉంది.కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు మార్చి 20న టీటీడీ తిరుమల వెంకన్న దర్శనాలు నిలిపివేసింది. కేంద్రం లాక్‌డౌన్ సడలించడంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జూన్ 8న దర్శనాలు ప్రారంభించింది. జూన్ 8, 9న టీటీడీ ఉద్యోగులకు దర్శన భాగ్యం కల్పించి ముందు ట్రైల్ రన్ నిర్వహించారు. జూన్ 10న తిరుపతి స్థానికులకు అవకాశం కల్పించారు.. జూన్ 10 నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతించారు. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ తగ్గిపోయింది. తిరుపతి, టీటీడీలో కరోనా కేసులు పెరగడంతో కొంతమంది ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నా.. దర్శనానికి దూరంగా ఉంటున్నారు.

Related Posts