YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సలహదారులు ఏం చేస్తున్నారు

సలహదారులు ఏం చేస్తున్నారు

పెద్దాపురం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తీసుకోంటున్న ప్రతి నిర్ణయాలపై అభాసు పాలు అవుతున్నారు.  నిన్న జరిగిన సంఘటనలో సి.ఆర్.డి.ఎ రద్దు మరియు రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు స్టే విధించడం హార్షణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో సీనియర్ ఐ.ఎ.యస్ అధికారులు ఉండి కూడా ముఖ్యమంత్రి కి సహేతుకమైన సలహాలు సూచనలు ఎందుకు చేయడం లేదు, ప్రభుత్వం చాలా మంది సలహాదారులను అపాయింట్ చేసుకోన్నారు. మరి ఆ సలహాదారులు, సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు.....? లేకపోతే సలహాదారులు ఇచ్చే సలహాలను ముఖ్యమంత్రి  విస్మరిస్తున్నారా......! ఎందుకు ఇలా జరుగుతుంది అని రాష్ట్ర ప్రజలందరూ అనుకొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక నిర్ణయాలు చెప్పే అధికారం  ఐ.ఎ.యస్ అధికారులకు ఉంది... కానీ ఈ రాష్ట్రంలో సీనియర్ ఐ.ఎ.యస్ అధికారులు ఉండి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాల అధోగతి పాలు చేస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై డెభ్బై పైబడి కేసులకు స్టే విధించిడం జరిగింది. కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదు అని చెప్పిన సందర్భాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.  కోర్టులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్టే ఇచ్చిన, ఆ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అని చెప్పిన ముఖ్యమంత్రి కి చీమ కట్టినట్టుగా కూడా లేదు
టస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒంటెద్దుపోకడలతో తీసుకోనే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కోర్టు నిన్నటి రోజున సి.ఆర్.డి.ఎ రద్దు మరియు రాజధాని వికేంద్రీకరణ పై స్టే విధించడం.. సంతోషకర పరిణామని అయన అన్నారు.

Related Posts