YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

లఢఖ్ ప్రాంతాలను కలుపుకొని పాక్ కొత్త మ్యాప్ నూతన రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ ఆమోదముద్ర

లఢఖ్ ప్రాంతాలను కలుపుకొని పాక్ కొత్త మ్యాప్  నూతన రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ ఆమోదముద్ర

న్యూ ఢిల్లీ  ఆగష్టు 5
పాకిస్తాన్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భారత్ కు చెందిన జమ్మూ కశ్మీర్ లఢఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ ఆమోదముద్రవేసింది. కొత్త మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరిస్తూ ఇది పాకిస్తాన్ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దంపడుతోందని.. పాకిస్తాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. కాగా ఇప్పటివరకు భారత్ నుంచి పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ లోని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’లో ఉన్న అన్ని ప్రాంతాలను అధికారికంగా పాకిస్తాన్ తమ భూభాగంగా పేర్కొనడం లేదు. గిల్గిట్ బాల్దిస్తాన్ ను తమ భూభాగంగా పేర్కొంటోంది. మిగిలిన పీవోకేను అజాద్ కశ్మీర్ గా పాకిస్తాన్ వ్యవహరించేది.కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తమ భూభాగంగా పాకిస్తాన్ కొత్త మ్యాప్ విడుదల చేయడం దుమారం రేపింది. ఇప్పటికే నేపాల్ కూడా ఇలానే భారత భూభాగాలను తమవి చెప్పుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా పీవోకేను కలిపేసుకోవడం వెనుక చైనా కుట్రలున్నట్టు భారత్ అనుమానిస్తోంది.కాగా ఇప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్ తమ కశ్మీర్ లోని అంతర్భాగంగా మ్యాప్ లో చూపిస్తోంది. దీన్ని పాకిస్తాన్ తాజాగా తన దేశంలో కలిపేసుకొని సాహసానికి ఒడిగట్టింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

Related Posts