YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జార్ఖండ్ కాంగ్రెస్ కూటమికి బీటలు

జార్ఖండ్ కాంగ్రెస్ కూటమికి బీటలు

రాంచీ, ఆగస్టు 6, 
ఎన్నికలు జరిగి ఆరు నెలలు కాలేదు. అప్పుడే అసంతృప్తి మొదలయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారానికి బీటలు వారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ అసంతృప్తి కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.జార్ఖండ్ అతి చిన్న రాష్ట్రం. 2000 సంవత్సరంలో ఏర్పాటయిన ఈ రాష్ట్రంలో విడతల వారీగా అధికారం మారుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అధికారం దక్కించుకోలేక పోయారు. జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బలంగా ఉంది. మొత్తం 81 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు దక్కాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలకంటే ఎక్కువగా రావడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది.భారతీయ జనతా పార్టీ 25 స్థానాలకే పరిమితమయింది. అయితే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 15 మంది వరకూ హేమంత్ సోరెన్ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా హస్తినకు చేరుకుని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో తమకు చోటు దక్కకపోవడంతోనే ఎమ్మెల్యేలు అసంతృప్తి బాట పట్టారని తెలిసింది. సోరెన్ మంత్రివర్గంలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. బీజేపీ కి జార్ఖండ్ లో అవకాశమివ్వకుండా కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆరు నెలల్లోనే అసంతృప్తి చెలరేగడంతో మిగిలిన కాలమంతా హేమంత్ సోరెన్ భయం భయంగా గడపాల్సిన పరిస్థితి జార్ఖండ్ లో నెలకొంది. మరి కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్నైనా కాపాడుకోగలదా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts