YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్మార్ట్ ఫొన్స్ కు ఓకే

స్మార్ట్ ఫొన్స్ కు ఓకే

హైద్రాబాద్, ఆగస్టు 6 
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ సెంటర్లలో స్మార్ట్ ఫోన్ల వాడకంపై ఆంక్షలున్నాయి. తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆస్పత్రుల్లో ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోగులు వీటిని నిర్భయంగా వాడుకునేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకు సూచించింది. స్మార్ట్ పరికరాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లలో మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి వున్న ఫీలింగ్ కలుగుతుంది.
కేంద్రం తన నిర్ణయంతో కుటుంబసభ్యులతో కరోనా రోగుల సంబంధాలు దెబ్బతినకుండా మానసికంగా కూడా వారికి మంచి ఊరట లభిస్తుందని భావిస్తోంది.  అప్పుడే రోగులు త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రోగులకు సెల్ ఫోన్ వాడేందుకు కరోనా ఆస్పత్రుల్లో అధికారులు పరిమితంగా అనుమతిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో వీడియో కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు మాత్రం లేదు.
దీంతో కేంద్రానికి ఈ విషయంపై పలు వినతులు  అందాయి. వీటిని పరిశీలించిన కేంద్రం.. తాజా ఆదేశాలు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు కరోనా రోగులకు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ లో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, దీనిపై వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ పంపిన తాజా లేఖలో పేర్కొంది. ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా రోగులు ఈ సదుపాయం పొందవచ్చు.

Related Posts