YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో ఏం జరుగుతోంది...

టీడీపీలో ఏం జరుగుతోంది...

విజయవాడ, ఆగస్టు 7, 
ఏపీ రాజకీయాల్లో ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ వన్, టూ, త్రీ సీజన్లకు చూసిన వారికి ఏ కన్స స్టెంట్ ఎలిమినేట్ అవుతాడో కనీస అవగాహన ఉంటుంది. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఎలిమినేట్ అయ్యే పార్టీ టీడీపీయేనని అంతా అంటున్నారు. ఏ మాత్రం ఇంకా సైకిల్ పార్టీపైన ఆశలు, సెంటిమెంట్లూ ఉన్న తమ్ముళ్ళకు కూడా అమరావతి రాజధాని ఎపిసోడ్ తో కళ్ళు తెరచుకుంటున్నాయట. ఇక ఏపీలో అయితే వైసీపీ, లేకపోతే బీజేపీ అన్నది బాగా కళ్ళకు కడుతోందిట.. గవర్నర్ మూడు రాజధానుల బిల్లు మీద సంతకం చేసిన తరువాత చంద్రబాబు మీడియతో లైవ్ లో మాట్లాడిన మాటలు చూస్తే జాలి కలిగేలా ఉన్నాయి. నాకోసమా ఈ రాజధాని, నేను ఎంతకాలం బతుకుతాను, మీ కోసమే కదా ఈ అభివౄధ్ధి అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు ఆయనలోని నిర్వేదాన్ని తెలియచేస్తున్నాయి. ఒక విధంగా తెలుగు నాట రాజకీయ రంగాన తన ఆటకట్టు అన్నది బాబు స్వరం నుంచే వెలువడిన సత్యం. నేను కాదు, టీడీపీ కాదు ముఖ్యం, భావితరాలు ముఖ్యం, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అలాగే ఏపీని కాపాడుకోవాలి. అంటూ చంద్రబాబు చేతులెత్తేసిన తీరుతో ఏపీలో టీడీపీ శకానికి క్లైమాక్స్ సీన్ వచ్చేసినట్లేనని అర్ధమైపోతోంది.చంద్రబాబే ఇపుడు అందరికీ టార్గెట్. ఆయనే అందరికీ కార్నర్ అవుతున్నారు. తెలంగాణాలో కేసీయార్ కి ఆయన రాజకీయంగా చెడిపోవడం కావాలి. ఢిల్లీలోని మోడీదీ అదే అజెండా. ఇక ఆగర్భ శత్రువు అన్నట్లుగా దూకుడు రాజకీయాలు చేస్తున్న జగన్ కి ఎటూ చంద్రబాబే గురి. ఇలా అన్ని వైపులా నుంచి పొంచి ఉన్న ప్రమాదం, చేతిలో అధికారం లేదు, వయసు అంతకంటే లేదు, పార్టీ భవిష్యత్తు మీద ఆశలు లేవు, వారసుడి మీద ధీమా లేదు. ఇవన్నీ కలసి చంద్రబాబుని కలచివేసే సన్నివేశాలే. కలల రాజధాని అని చెప్పుకునే అమరావతి గురుతులు చెరిగిపోతే చంద్రబాబుకు ఇక చరిత్రలో మిగిలేదీ లేదు.ఏపీలో వైసీపీకి అధికారం ఉంది. పైగా జగన్ యువ సీఎం మరిన్ని టెర్ములు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. ఆయన పార్టీ సామాజిక పునాది, రాజకీయ సిధ్ధాంతం కూడా వేరు. దాంతో బీజేపీ కన్ను ఎపుడూ టీడీపీ మీదనే ఉంది. ఏపీలో చంద్రబాబుని దెబ్బకొడితేనే రెండవ స్థానానికి వచ్చేది. అందువల్లనే టీడీపీనే బీజేపీ కార్నర్ చేసింది. ఇక బాబుని నెత్తిన పెట్టుకుని పొత్తు పెట్టుకుని గెలిపించాల్సిన సీన్ కూడా లేదు. గెలిచిన తరువాత మళ్లీ ఆయన వేరే కూటమి కట్టి కొంప మీదకు తెస్తారు. ఇవన్నీ చూసేసిన సినిమాలు, ఇక చంద్రబాబుకు కూడా మళ్ళీ గెలిచే సీన్ కూడా లేదు. అందుకే ఆయనతో ఏ విధమైన రాజకీయ మొహమాటాలూ లేకుండా ఏపీ పొలిటికల్ తెర మీద నుంచి ఎలిమినేట్ చేయడానికే బీజేపీ స్ట్రాంగ్ గా నిర్ణయించుకుంది. దానికి వైసీపీ నుంచి పూర్తి సహాయం లభిస్తోంది. చేతికి మట్టి అంటకుండా ఒక పార్టీతో మరో పార్టీని మట్టి కరిపించే కధ బీజేపీ నడుపుతోంది. ఈ మొత్తం పొలిటికల్ గేమ్ లో మొదట అవుట్ అయ్యేది టీడీపీయే. ఆ సత్యం బాబుకు తెలిసేసరికి 2024 ఎన్నికలు ముగిసిపోతాయ్.

Related Posts