విశాఖపట్టణం ఆగస్టు 7,
ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం పూర్తయ్యింది. గత కొద్ది నెలలుగా ఊరిస్తూ వచ్చిన ఈ అంశంలో చివరి అంకాన్ని గవర్నర్ పూర్తి చేశారు. తాజా బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇకపై ఏపీకి లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ కొనసాగనున్నాయి. ఇక విశాఖకు ఎక్కడా లేని వెలుగు వచ్చిందన్నది మాత్రం నిజం. ఈ బిల్లు అలా ఆమోదం పొందిందో లేదో వెంటనే విశాఖలో భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. జిల్లాలో కనిష్టంగా 5 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు భూముల విలువలు పెరిగిపోయాయి.ఇక శతాబ్దాల విశాఖ చరిత్రలోనే ఇప్పుడు వచ్చినంత ఊపు ఎప్పుడూ రాలేదని విశాఖ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చంద్రబాబు సీఎం అయినప్పుడు విశాఖ అభివృద్ధి కోసం పెద్ద పెద్ద ప్రణాళికలే వేసుకున్నారు. పర్యాటకంగా విశాఖను అభివృద్ధి చేస్తానంటూ నానా హడావిడి చేశారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఇక్కడ స్టూడియోలు కడతానని చెపితే భారీ రాయితీలతో పాటు భూములు కూడా తక్కువ ధరకే కేటాయిస్తామని చెప్పారు. అదిగో స్టూడియో…ఇదిగో ఇండస్ట్రీ అని నానా హడావిడి చేశారు. అవన్నీ అతీ గతీ లేకుండా పోయాయి. ఇక పర్యాటక రంగంలో పెట్టుబడులు, విదేశీ కంపెనీలు అని ఊదరగొట్టారు.ఇక లోకేష్ ఐటీ మంత్రి అయ్యాక చివరి ఏడాదిలో మాత్రం రెండు, మూడు ఐటీ కంపెనీలు తీసుకు వచ్చి హడావిడి చేశారు. హుదూద్ తుఫాన్ సమయంలో జరిగిన డ్యామేజ్, అభివృద్ధిని వదిలేస్తే విశాఖ ప్రజల్లో చంద్రబాబుపై ఇప్పుడు రాజధాని విషయంలో వచ్చినంత జోష్ రాలేదనే చెప్పాలి. నాడు చంద్రబాబు విశాఖ విషయంలో హడావిడి చేసి ఫెయిల్ అయితే.. నేడు జగన్ ఇక్కడ రాజధాని ప్రకటన చేసిన వెంటనే వైజాగ్‌లో ఎక్కడా లేని ఊపు వచ్చింది. జగన్‌కు మంచి ప్లస్ కూడా అయ్యేలా ఉంది.ఇక విశాఖ అభివృద్ధిపై జగన్ ముందు నుంచి మాటల కంటే పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నారు. ఇది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నగరం. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖ వరకు మెట్రో రైల్ ప్రతిపాదనలు కూడా ఊపందుకోనున్నాయి. ఇక విశాఖ చుట్టుపక్కల కావాల్సినన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఐటీ రంగం, ఫార్మా, పర్యాటకంతో పాటు పరిశ్రమలు పెట్టేందుకు అనువైన నగరం కావడంతో జగన్ మరో రెండేళ్లలోనే పక్కా ప్లానింగ్‌తో వైజాగ్‌కు మరిన్ని హంగులు అద్దనున్నారు.ఇక జగన్ వల్ల వైజాగ్‌కు ఎంత కళ వచ్చిందో రేపటి రోజున ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేస్తే వైజాగ్ వల్ల జగన్‌కు మరింత హెల్ఫ్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రాయితీలు, ఎన్ని హామీలు ఇస్తామన్నా ముందుకు రాని పారిశ్రామిక వేత్తలు, సినిమా పెద్దలు అంతా ఇప్పుడు నగరానికి రాజధాని శోభ సంతరించుకోవడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. సో అలా వైజాగ్ విషయంలో చంద్రబాబు కన్నా జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.