YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుశాంత్ బాటలోనే సమీర్ శర్మ

సుశాంత్ బాటలోనే సమీర్ శర్మ

ముంబై, ఆగస్టు 7, 
ఈమధ్యకాలంలో అనారోగ్యాలే కాదు ఆత్మహత్యలతోనూ బాలీవుడ్ నటులు దూరం అవుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి బయటకు రాకముందే మరో ఘటన జరిగింది. తాజాగా హిందీ యువనటుడు, బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న టీవీ నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని మలాద్‌లో తానూ అద్దెకుంటున్న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు.. సూసైడ్ లాంటి నోటీసు ఏమీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతని ఆత్మహత్య సంగతి బయటగకు రాలేదు. అయితే, సమీర్ రెండు, మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీర్‌ ఉంటున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు పోలీసులు. తలుపులు తెరిచి చూడగా సమీర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు.అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. అసలు సమీర్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది దర్యాప్తులో వెల్లడి కానుంది.  కొద్దిరోజుల క్రితం తాను డిప్రెషన్ ఉన్నట్లుగా ఇన్ స్టాగ్రామ్‌లో ఇటీవల ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్టే ఇప్పుడు ఆధారం కానుంది. మరోవైపు యువనటుడు సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. యే రిస్తే హై ప్యార్ కె లో సమీర్ శర్మ నటించారు.

Related Posts