YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మళ్లీ వేడెక్కుతున్న వాతావరణం

మళ్లీ వేడెక్కుతున్న వాతావరణం

అకాల వర్షాలకు చల్లబడ్డ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిమికి బయపడి జనం రోడ్డెక్కాలంటెనే జంకుతున్నారు.ఉదయం 10 దాటిందంటే రోడ్లన్ని 

నిర్మానుష్యంగా మారుతున్నాయి.కాలంతో పాటు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కాకపొతే ఈ ఏడాది ఎండలు కాస్త ముందుగానే ముదురుతున్నాయి. పగటి ఉష్ణొగ్రతలో గత నాలుగు రోజుల నుండి పెరుగుదల నమోదవుతుంది జిల్లాలో పది రోజులుగా ఎండదెబ్బకు పలువురు మృతిచెందారు. ప్రభుత్వం ముందు చూపుతో శాఖలను అప్రమత్తం చేసి ఎండ సమయంలో బయటకు వెళ్లవద్దని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఎండల బారి న పడకుండా ఉండాలంటే వైద్యులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇటీవల వాతావరణంలో అనూహ్యమార్పులు చోటు చేసుకుంటున్నాయి... చెరువు, కుంటలు, బావుల్లో నీళ్లు లేకపోవడంతో అడవులు తరగడం వంటి చర్యలతో వాతావరణం వానకాలం వర్షా లు కురవకపోవడం, ఎండాకాలం మండే ఎండ లు... ఈ సారి ఎండవేడిమి 39-41డిగ్రీల మధ్య ఉంది. ఇంకా రెండు నెలల ఎండాకాలం మరింతగా ఊష్ణోగ్రతలు పెరుగనున్నాయి. ఈ సంవత్స రం మార్చి మాసాంతంలోనే యువకులు ఎండవేడిమిని తట్టుకోలేక, జీవనోపాధి కోసం ఎండలో తిరిగేవారు మృత్యువాత పడుతున్నారు. ఈ స్థాయి లో ఎండవేడిమిని వృద్ధులు, చిన్నారులు త ట్టుకోలేరు. సునాయాసంగా ఉండే వృద్ధు లు, చి న్నారులు ఎండవేడిమికి రీహైడ్రేషన్ అయ్యే అవకాశాలున్నాయి. రీహైడ్రేషన్ అయినా తొందరగా కోలుకోలేక మృత్యువాత పడుతారు. అందువల్ల ఉద యం, సాయంత్రం పూట మాత్రమే బయటకు పోవాలి.మధ్యాహ్నం పూట సూర్యకిరణాలు త లపై పడి వడదెబ్బ తాకే ప్రమాదం ఏర్పడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరుగకూడదు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే గొ డుగులు, టోపీలు, కండ్లజోళ్లు దరించి వెళ్లాలి. వ దులైన లేత రంగుల కాటన్ దుస్తులను దరించాలి. పరిశుభ్రమైన నీటినే తాగాలి. ప్రతి రోజు వయస్సును బట్టి 4 నుంచి 8 లీటర్ల నీరు తప్పక తా గాలి. మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయలు, దోసకాయలు, కొబ్బరినీళ్లు వంటి వాటితో శరీర తాపం తీర్చుకోవాలి. తరచుగా ఉప్పు, లవణాల మిశ్రమం(ఎలక్ట్రాల్) వంటి ద్రవాలు తాగించాలి. ఎవరికైనా తలతిప్పినట్లు అనిపిస్తే వెంటనే పీహెచ్‌సీకి తీసుకురావాలి. 

Related Posts