ప్రతి మనిషికి కష్ట సుఖాలు ఉంటాయి...
ఎవరైతే కష్టాలు వచ్చినప్పుడు...
కృంగిపోకుండా...
అవి తట్టుకుని నిలబడటానికి...
శక్తిని ఇవ్వమని ఆ భగవంతుడి చుట్టూ తిరుగుతారో...
వారికి ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది...
వారికి ఇంకా పరీక్షలు పెడుతూనే...
వారికి ఎప్పుడు ఏమి కావాలో సమకూర్చుతూ ఉంటాడు...
అంతేగాని దేనికీ లోటు చేయడు...
వాళ్లు తెలిసీ తెలియక...
ఏదైనా చెడు మార్గంలో వెళ్లాలనుకున్నా...
వెళ్ళనివ్వడు...
కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు...
ఆయనకు ఏం కావాలో వాళ్లతోనే చేయించుకుంటాడు...
అలాగే వాళ్లకు కావాల్సింది ఇస్తాడు...
భగవంతుడైనా అన్ని వేళలా అన్నీ ఇవ్వడం కుదరదు..
ఏదైనా వాళ్లకు ఆయన ఇవ్వలేకపోయాడు అంటే...
అంతకంటే విలువైనదే వాళ్లకు ఇస్తాడు అనేది నూటికి నూరుపాళ్ళు నిజం...
అందుకని పరిస్థితులకు తగినట్లుగా...
మనం భగవంతుని నామస్మరణలో ఉండటం తప్ప...
చేయగలిగింది ఏమీ లేదు...
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ధర్మం తప్పకుండా నడిస్తే...
ఆ స్వామి వారి మహిమల్ని మనం తప్పకుండా చూడొచ్చు...
దానికి ఎంతో సహనం ఉండాలి...
నిగ్రహం ఉండాలి...
సాధన ఉండాలి...
ఎప్పుడైతే సాధన అనేది చేసామో...
అప్పుడు మనమే మహాత్ములం అవుతాం...
అన్న ది అక్షరాలా సత్యం...
మహాత్మ అందరూ ఒకప్పుడు మామూలు మనుషులే...
వారు చేసిన సాధన వల్ల మహాత్ములవుతారు...
సాధన అనేది లేకపోతే ఏదీ సాధ్యం కాదు...
కనుక సాధన చేద్దాం...
భగవంతుని నామస్మరణలో లీనమవుదాం...
*సర్వేజనాః* *సుఖినోభవంతుః*
*జై* *శ్రీ**కృష్ణా* ...