రాజన్న సిరిసిల్ల ఆగస్టు 7,
మూఢనమ్మకాలు నమ్మే ప్రజలు ఉన్నంత కాలం ఈ బాబాలను నమ్మి అమాయక ప్రజలు మోసపోతూనే ఉంటారు. అమాయక ప్రజల ఆరోగ్య అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న దొంగ బాబాలు. కొందరు కుటుంబ ఆరోగ్య సమస్యలు రావడంతో ఇలాంటి బాబాలు ను ఆశ్రయించడం వల్ల అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని మీ కుటుంబానికి పట్టిన ఆరోగ్య సమస్యలను, ఇంటి సమస్యలను క్షుద్ర పూజలతో భూతవైద్యంతో నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పి అమాయక ప్రజల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తు జిల్లాలో రెచ్చిపోతున్నా నకిలీ దొంగ బాబాలు. ఓ అమాయక కుటుంబానికి ఆరోగ్య సమస్యలు నయం చేస్తానంటూ క్షుద్ర పూజలు భూతవైద్యం చేస్తున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టలో పెద్దూర్ కు చెందిన ఓ నకిలీ దొంగ బాబా బాగోతం బయట పడింది. ఓ అమాయక కుటుంబానికి మాయమాటలు చెప్పి అగ్రహారం గుట్టల్లోకి తీసుకువచ్చి ఆ కుటుంబానికి పట్టిన ఆరోగ్య సమస్యలను భూత వైద్యం పేరుతో నయం చేస్తానంటూ అగ్రహారం గుట్టలో దిష్ట వేసి క్షుద్ర పూజలు మొదలు పెట్టాడు. క్షుద్ర పూజలు భూత వైద్యం చేస్తూ అడ్డంగా దొరికిన నకిలీ దొంగ బాబా. అయితే అక్కడే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారిని చూసి వీడియో తీశారు. ఇక్కడ ఏం మంత్రాలు ఏం భూతవైద్యం చేస్తున్నారంటూ నిలదీయడంతో అక్కడి నుండి అన్ని సదురుకొని పరారయ్యాడు నకిలీ దొంగ బాబా. అయితే జిల్లాలో ఇలాంటి నకిలీ దొంగ బాబాల పై పోలీస్ ల నిఘా కూడా లేకపోవడంతో అమాయక ప్రజల జీవితాలతో అటలాడుతున్నారు దొంగ బాబాలు. ఇలాంటి దొంగ బాబాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ప్రజలు పోలీస్ లను కోరుతున్నారు.