న్యూ ఢిల్లీ ఆగష్టు 7
జాతీయ విద్యా విధానం కింద ఉన్నత విద్యలో కాలానుగుణ సంస్కరణల అంశంపై ఇవాళ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సుమారు మూడు నుంచి నాలుగు ఏళ్ల విస్తృత చర్చల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించినట్లు ప్రధాని వెల్లడించారు. దీని కోసం లక్షల సంఖ్యలో సలహాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం గురించి చర్చ జరుగుతోందన్నారు. విభిన్న రంగాలు, భావాలు కలిగిన వ్యక్తులు కొత్త విధానంపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, నూతన విద్యా విధానాన్ని సమీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. అయితే ఇది ఆరోగ్యకరమైన చర్చ అన్నారు. ఎంత ఎక్కువగా విద్యా వ్యవస్థ గురించి చర్చిస్తే, అపుడు అది దేశ విద్యా వ్యవస్థకు లాభదాయంగా మారుతుందని ప్రధాని తెలిపారు. జాతీయ విద్యా విధానం ప్రకటించిన తర్వాత ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదన్నారు. కొత్త విధానం వల్ల అందరూ సంతోషపడినట్లు ప్రధాని వెల్లడించారు. ప్రతి దేశం తమ విద్యా వ్యవస్థతోనే జాతీయ విలువలను సంఘటితం చేస్తుందన్నారు. జాతీయ లక్ష్యాలకు తగినట్లుగా విద్యా వ్యవస్థను సంస్కరిస్తుంటాయన్నారు. వర్తమాన, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థను తీర్చుదిద్దుతారతన్నారు. కొత్త విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంచుతుందని పరవ్ధాని మోదీ తెలిపారు. విద్యా వ్యవస్థ సంస్కరణ గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందన్నారు. సమగ్రమైన రీతిలో విద్యా విధానాన్ని రూపొందిచినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య కోసం పనిచేయాలన్నారు. అనేక విద్యా సంస్థలకు అటానమీ ఇచ్చారని, ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందన్నారు.కొత్త విధానంలో టీచర్ల డిగ్నిటీకి కూడా స్థానం కల్పించినట్లు చెప్పారు. టీచర్లు కూడా తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఇన్నాళ్లూ మన విద్యా వ్యవస్థ ఏం ఆలోచించాలన్న దానిపైనే దృష్టి పెట్టిందని, ఇక ఇప్పుడు కొత్త విద్యా విధానం ఎలా ఆలోచించాలన్న అంశాన్ని ఫోకస్ చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ రోజుల్లో సమాచారానికి కొదవ లేదని, అయితే పిల్లలకు విశ్లేషణాత్మక వివరణలు ఇవ్వడమే కొత్త విద్యా విధాన లక్ష్యమన్నారు.