సూర్యాపేట ఆగష్టు 7
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో విడత ఉచిత చేప పిల్లల కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలోని కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ కులవృత్తులకు జీవం పోస్తున్నారని తెలిపార. దీంతో సబ్బండ వర్ణాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని మంత్రి తలసాని అన్నారు. చెరువుల్లో పెంచిన చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు వాహనాలను, మార్కెట్ సదుపాయం ప్రభుత్వమే కల్పించింద్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడంతో వదల కోట్ల రూపాయల సంపద నేరుగా మత్స్యకారులకు చేరుతుందన్నారు. తద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడలను తలసాని సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్, అధికారులు పాల్గొన్నారు.