YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

అక్కడ పోయిన వారు సగం మంది చనిపోతున్నారు

అక్కడ పోయిన వారు సగం మంది చనిపోతున్నారు

హైదరాబాద్ ఆగష్టు 7 
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మెజారిటీ పేషంట్లు గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చనిపోతున్నారు. జిల్లా హాస్పిటల్స్ లో పాజిటివ్ పేషంట్లను గాంధీకి పంపిస్తున్నారు. అక్కడికి పోతే పదిలో ఐదుగురు మరణిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన అబ్దుల్ ఖయూమ్ అనే వ్యక్తి గాంధీలో చేరి తనను ఎవరూ చూడడం లేదని కొడుక్కి ఫోన్ చేసి చెప్పారు. చెప్పినట్లుగానే నిన్న వైద్యం అందక అతడు చనిపోయాడు. నేను సిబ్బందిని తప్పుపట్టడం లేదు.  వంద మంది పేషంట్లకు ఒక్క డాక్టర్ ఉంటే వారు ఏమి చేస్తారు. వసతులు కూడా లేవని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మరొక పేషంట్ ను కూడా గాంధీకి రెఫర్ చేస్తే..మేము అక్కడికి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాము. ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆ పేషేంట్ కోలుకుంటున్నారు. ఎందుకు ఆ తేడా ఉంటుందో వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల దృష్టి పెట్టాలి. డబ్బులు లేని వారే గాంధీకి వెళుతున్నారు. డెడ్ బాడీ ని ప్యాక్ చేసి ఇవ్వడానికి కూడా 30వేలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎలాగూ బ్రతికే అవకాశం ఇవ్వడం లేదు, కనీసం డెడ్ బాడీ ని కూడా ప్రభుత్వం ప్యాక్ చేసి ఇవ్వలేదా?  ఇంత నీచంగా ప్రభుత్వం పని చేస్తోందని అయనమండిపడ్డారు.
చీఫ్ సెక్రటరీ పై జగ్గారెడ్డి ఫైర్
సీఎం సెక్రటేరియట్ కట్టడంలో బిజీగా ఉన్నారు. మరి సీఎస్ ఏం చేస్తున్నారు. సీఎస్ కొత్త సచివాలయం డిజైన్ కు సున్నాలు కొడుతున్నారా ?  ప్రజల ప్రణాలు కాపాడే బాధ్యత మీకు లేదా? నా నియోజకవర్గ ప్రజల కోసం త్వరలో ఒక కార్యాచరణ తీసుకుంటానని అయన అన్నారు.

Related Posts