YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రైతు వంటి పై విరిగిన లాఠీ ఫిర్యాదు చేసిన వారి పైనే దాడి....

రైతు వంటి పై విరిగిన లాఠీ ఫిర్యాదు చేసిన వారి పైనే దాడి....

సూర్యాపేట ఆగష్టు 7 
ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకు వచ్చామని పదేపదే చెబుతున్న అదంతా వట్టి మాటలే కొందరు పోలీసు అధికారులు. ఈ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు అభాసుపాలు చేస్తున్నారు. సివిల్ కేసుల్లో లో తలదూర్చి అధికారం పోలీసులకు లేకున్నా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటున్నారు.  తాము చెప్పిందే వినాలి అంటూ అక్కడికి అక్కడికి తీర్పులు చేస్తున్నారు లేదంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు లాఠీలు విరిగాయి అంతవరకు చితకబాదడం పరిపాటిగా మారింది. ఇదే ఫార్ములా సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఎస్సై కూడా అనుసరిస్తున్నాడు ఓ రైతు భూవివాదంలో తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా న్యాయం చేయకపోగా ఎదురుదాడికి దిగి ఏకంగా రైతు ఒంటిపై లాటి విరిగి అంతవరకూ చితకబాదాడు.  సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని తాను చెప్పింది వినకుంటే చంపుతా నంటూ బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.  దీంతో సదరు రైతు భయం భయం తో తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఓర్సు మల్లయ్యకు నాగారం మండలం ఈటూరు గ్రామ సమీపం నాగారం శివారులో సర్వే నెంబర్ 585 ఆ/1/2లో 20 గుంటల వ్యవసాయ భూమి, 586ఆ/2 3ఎకరాల 20గుంటల భూమి ఉంది.గతంలో అధికారులు ఈ భూమికి పట్టాదారు పాసు బుక్కులను జారీ చేశారు గత పదిహేను సంవత్సరాల్లో కబ్జాలో కొనసాగిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న పాసుబుక్కులు రద్దుచేసి కొత్త పాస్బుక్కులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ బుక్ లో సర్వే నెంబర్ 585 ఆ లో లో మూడు ఎకరాల 20 గుంటలు సర్వే నెంబర్ 586 ఆ 1 /  2 లో 20 గుంటల భూమి ఉన్నట్లు చూపుతుంది మల్లయ్య మొత్తం నాలుగు ఎకరాల భూమి ఉండగా సర్వే నెంబర్లను మార్చి నాలుగు ఎకరాల 20 గుంటల భూమి ఉన్నట్లు పాస్ బుక్ లను అందజేశారు. పాస్ బుక్ లో అదనంగా నమోదు అయినా 20గుంటల భూమిని రద్దు చేయడంతో పాటు సర్వే నెంబర్లలో తప్పులు దొర్లి 20గుంటలు భూమి ఉన్న సర్వే నెంబరు 585ఆ/1/2లో 20గుంటల ఉండగా 3ఎకరాల 20గుంటల చూపడం సర్వే నెంబరు 586ఆ /2/1లో 3 ఎకరాల 20గుంటలు ఉండగా కేవలం దానిలో 20గుంటలు చూపడం జరిగింది.
 దీనిని సరి చేయాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఈ సంవత్సరం పాటు  కాళ్లు అరిగేలా మల్లయ్య తన కుమారుడు అశోక్ తిరుగుతున్నారు అయినా  డబ్బులు డిమాండ్ చేస్తూ పాస్ బుక్కులను సదరు అధికారులు మార్చలేదు ఇదే అదునుగా భావించిన మల్లయ్య పాలివాడు సోమయ్య దాన్ని కబ్జా చేశాడు ఈ క్రమంలో వీరికి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి మల్లయ్య భూమి తనదేనని అందులో కంది పైరు వేశాడు దానిని సోమయ్య ధ్వంసం చేశాడు ఈ ఇరు కుటుంబాల వారు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు ఈనెల 4వ తేదీన ఇరువర్గాల వారు గొడవపడగా మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనంతరం సోమయ్య గూడా పోలీసులను ఆశ్రయించాడు ఎస్సై లింగం సివిల్ వివాదంలో తల దూర్చకండి ఇరువురి పై చాల జరిపి ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడాన్ని మరిచారు మొదటి ఫిర్యాదుదారుడు మల్లయ్య ఆయన కుమారుడు అశోక్ ను స్టేషన్కు పిలిపించి తాను చెప్పినట్లు విను కోవాలని లేదంటే చంపుతానని బెదిరించాడు తనకు లక్ష రూపాయలు ఇవ్వాలి లేకుంటే లక్ష రూపాయలు ఇస్తాను ఈ భూమి వదులుకొని పోవాలంటూ డిమాండ్ చేయడంతో వారు అందుకు నిరాకరించారు దీంతో సెల్ లో వేసి తన లాఠీ విరిగే అంతవరకూ కు కు విచక్షణ రహితంగా చితకబాదాడు.
 మల్లయ్య చిన్న కుమారుడు కొంతమంది పాత్రికేయులను ఆశ్రయించి తమ తండ్రి మల్లయ్య, అన్న అశోక్ ను ఎస్సై లింగం చితక బాదు తున్నాడని చెప్పడంతో సదరు పాత్రికేయులు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా అలాంటి వారు తమ స్టేషన్లోనే లేరని తమకు ఏది తెలియదంటూ సమాచారం ఇచ్చారు వారి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో స్టేషన్కు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో మల్లయ్య అతని కుమారుడు గాయాలతో అక్కడే ఉన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఎస్సై లింగం తీరును బోరున విలపిస్తూ చెప్పారు తమకు ఎలాగైనా స్టేషన్ నుండి బయటకు తీసుకు వెళ్లాలంటే ప్రాధేయపడ్డారు అయినా ఖాకీలు కనికరించలేదు చివరకు స్టేషన్ ఆవరణలో ఉన్న బైక్ లో ఉన్న  పెట్రోల్ను తీసుకొని ఒంటిపై పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి వారు యత్నించగా చివరకు వారిని వదిలేశారు.
పోలీస్ స్టేషన్ నుండి ప్రాణాలతో బయట పడ్డ మల్లయ్య,కొడుకు అశోక్ తో కలిసి జిల్లా ఎస్పీ  భాస్కరన్ ను ఆశ్రయించారు. తనకు ప్రాణ రక్షణ కల్పించమంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Related Posts