నెల్లూరు
ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రపంచంలోకి అడుగు పెట్టిందో... అప్పటినుండి దానిని ఎదుర్కోవడానికి పలు ఆయుధాలలో ఒక ఆయుధంగా శానిటైజర్ లు వెలుగులోకి వచ్చాయి. శానిటైజర్ లను ఎక్కువ శాతం మంది చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడుతుంటే.... మరికొంతమంది మద్యం ప్రియులు మందు దొరకక, దొరికినా ధరలు కొండెక్కడం తో ఆ ధరలు పెట్టలేక శానిటైజర్ లలో ఆల్కహాల్ ఉందని తెలిసి మద్యం ప్రియులు శానిటైజర్ లు త్రాగుతుండడంతో ఇటీవల కాలంలో చాలా మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అలాంటి మద్యం ప్రియులకు, అదేవిధంగా శానిటైజర్ లు అమ్మే మెడికల్ షాపుల ఇతర షాపుల యజమానులకు అవగాహన కల్పించడానికి వెంకటగిరి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. వెంకటగిరి పట్టణంలోని శానిటైజర్ లు అమ్మే మెడికల్ షాపులు ఇతర షాపులను సందర్శించి శానిటైజర్ ల అమ్మకంపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా షాపుల యజమానులకు, ప్రజలకు శానిటైజర్ లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ & ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ విజయ్ కుమార్ తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.