YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి

ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి

నందవరం

ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి కులాలు వేరుకావడంతో అంతలో ఆ ఇద్దరిని దూరం చేసింది భర్త ఇంటి ముందు భార్య ధర్నా న్యాయం కావాలని కోరిన బాధితురాలు. బాధితురాలికి మహిళా సంఘాల మద్దతు 
 ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారు.పెళ్లి చేసుకున్నారు.నాలుగు రోజులు కలిసున్న తరువాత అమ్మాయిని వదిలేసి సొంతూరికి వెళ్లాడు.ఎంతకూ తిరిగి రాకపోవడంతో అమ్మాయి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.వివరాలు..కర్నూలు జిల్లా నందవరం మండల కేంద్రానికి చెందిన లింగాయత్ కులానికి రాకేష్, హైదరాబాద్ కు ఎస్ సి కులానికి చెందిన అనూషతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా ముదిరి రాకేష్ అనుషా లు జూన్ 4వ తేదీన పెళ్లి చేసుకున్నారు.పెళ్లికి కులాలు అడ్డురాలేదు.కానీ కాపురానికి అమ్మాయి కులం అడ్డుగోడగా నిలిచింది. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది.ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ కుల గోడ  అడ్డుగా ఏర్పడడంతో  ఇంతలో రాకేష్ కు స్వంత ఊరు నందవరం వైపు గాలి మళ్లింది అనుకున్నదే తడవుగా  రాకేష్ నందవరం కు వెళ్లాడు.ఎంతకూ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ  రాకేష్ ఇంటి ముందు నాకు న్యాయం కావాలి అంటూ ధర్నాకు దిగింది.  బాధితురాలికి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నాయకులు ఆమెకు  మద్దతు తెలుపుతూ బాధితురాలికి న్యాయం జరిగేవరకు వదిలే ప్రసక్తిలేదని మహిళా సంఘాలు ఘాటుగా స్పందించారు.

Related Posts