YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*కోవిడ్-19పై ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానాలు*
కోవిడ్-19 వైరస్ ఇప్పుడు మన జీవితంలో నిత్యకృత్యమైంది. ప్రతిరోజూ బయటకు వెళ్లినపుడల్లా కోవిడ్-19 సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అయినప్పటికీ దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వైరస్ పై ఉన్న సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా కోవిడ్-19పై ఉన్న అపోహలు తొలగించుకోవచ్చు. తద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చో అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండవచ్చు. 
*మాస్కులు ధరించడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చా?*
జలుబు మరియు దగ్గు వంటి కోవిడ్-19 లక్షణాలతో ఉన్న వ్యక్తు లు మరియు కోవిడ్-19 సోకిన రోగులతో ఉన్న ఆరోగ్య నిపుణులు మాత్రమే మాస్కులు ఉపయోగించాల్సిన అవసరం ఉంది . ఒకవేళమీరు బహిరంగ ప్రదేశాలకు వెళ్తే ఇతరుల తుమ్ము, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించు కోవడానికి మాస్క్ లు ధరించవచ్చు.
*మాంసాహారాన్ని తినడం ఆపేస్తే కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చా?*
మాంసం తినడానికి కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదు.
*కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ ఎంత త్వరగా అభివృద్ధి చేయవచ్చు?*
ఏదైనా ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలంటే సమయం పడుతుంది. అలాగే కోవిడ్-19 టీకా అభివృద్ధికి కూడా ఏడాదికిపైనే పడుతుందన్న ప్రచారం ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వాక్సిన్ ఇచ్చే అనుమతులను త్వరగా ఇస్తున్నందువల్లే ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు.
*నాకు కోవిడ్-19 వైరస్ లక్షణాలు ఉండే నేను నేరుగా ఆస్పత్రికి వెళ్లవచ్చా?*
మీకు కోవిడ్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులకు దూరం ప్రత్యేక గదిలో ఉంటూ మీ పరిస్థితిని స్థానికంగా ఉండే వాలంటీర్ కు, ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలి. వారు ఇచ్చే సూచనలకు అనుగుణంగా నేరుగా ఆస్పత్రికి వెళ్లాలా లేక ఇంట్లోనే ఉండాలా అన్నది నిర్ణయించుకోవాలి. లేదంటే కాల్ సెంటర్ నంబర్ 104 కి  కాల్ చేసి సలహా తీసుకోవచ్చు.
*కోవిడ్-19 చికిత్సకు ఏదైనా ఇంటి నివారణలు ఉన్నాయా?*
ప్రస్తుతానికి కోవిడ్-19కి అల్లోపతిలో మాత్రమే చికిత్స ఉంది. ఇంటి చిట్కాలు పనిచేయవు. అయినప్పటికీ మన శరీరంలో వైరస్ ప్రవేశించకుండా నిరోధించే రోగ నిరోధకశక్తిని మాత్రం ఇంటి చిట్కాల ద్వారా పెంచుకోవచ్చు. కాబట్టి వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*కోవిడ్-19 వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో వ్యాపించగలదా?*
అవును. ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాల ప్రకారం కోవిడ్-19 వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంతో సహా అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తుంది.
*వేడినీళ్ల స్నానం కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి ఉపయోగపడతుందా?*
లేదు. వేడి నీళ్ల స్నానాలు కోవిడ్-19 వైరస్ సంక్రమణను నిరోధించలేవు.
*న్యుమోనియా టీకాలు కోవిడ్-19 నుండి రక్షిస్తాయా?*
లేదు. మునుపటి టీకాలు కోవిడ్-19 వైరస్ నుంచి మిమ్మల్ని రక్షించలేవు.
*శరీరంపై ఆల్కాహాల్ లేదా క్లోరిన్ చల్లినట్టయితే కోవిడ్-19 వైరస్ చనిపోతుందా?*
లేదు. ఆల్కాహాల్ లేదా క్లోరిన్ చల్లడం ద్వారా కోవిడ్-19 వైరస్ చనిపోదు.
*కోవిడ్-19 వైరస్ సంక్రమణను నివారించడానికి ముక్కును సెలైన్ తో క్రమం తప్పకుండా కడగడం సహాయపడుతుందా?*
లేదు. ముక్కును సెలైన్ తో శుభ్రం చేయడం ద్వారా వైరస్ సంక్రమణను నిరోధించలేదు.
*కోవిడ్-19 వైరస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుందా?*
లేదు. దోమలు కరోనా వైరస్ ను వ్యాప్తి చేయవు. ఇలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. 
*వెల్లుల్లి తినడం కోవిడ్-19 వైరస్ సంక్రమణను నివారించగలదా?*
వెల్లుల్లి తినడం వలన కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణ లభించదు.
*కోవిడ్-19 ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయోటిక్స్ ప్రభావవంతంగా ఉన్నాయా?*
లేదు. యాంటీబయోటిక్స్ వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేయవు. అవి బ్యాక్టీరియాకు మాత్రమే పనిచేస్తాయి.
*కొత్త కోవిడ్-19 వైరస్ వృద్ధులను ప్రభావితం చేస్తుందా? లేదా యువకులు కూడా దీని బారిన పడుతున్నారా?*
అన్ని వయసుల వారికి కోవిడ్-19 వైరస్ సోకుతుంది. వృద్ధులు మరియు ముందుగా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
*కొత్త కోవిడ్-19 వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్ధిష్టమైన మందులు ఉన్నాయా?*
ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్ధిష్టమైన ఔషధాలు సిఫారసు చేయబడలేదు. అయినప్పటికీ వైరస్ సోకిన వారు లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి, కోలుకోవడానికి సరైన చికిత్స, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు కోలుకోవడానికి మెరుగైన సంరక్షణ పొందాలి.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

Related Posts