తిరుపతి, ఆగస్టు 8,
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 12న గోకులాష్టమి సందర్భంగా ఉదయం 10.30 గంటలకు 'గోపూజ మహోత్సవం' జరుగనుంది.
భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.
కానీ ఈ ఏడాది కోవిడ్ - 19 నిబంధనల మేరకు తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోకులాష్టమి 'గోపూజ మహోత్సవం'ను ఏకాంతంగా నిర్వహిస్తారు.