ఏలూరు ఆగస్టు 8,
రాష్ట్రంలో కోవిడ్ హాస్పిటల్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశించారని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. శనివారం నాడు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ లో కరోనా జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం లో అయన పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చేరుకువాడ రంగనాధ్ రాజు, తానేటి వనిత, శాసనసభ్యులు కోటరీ అబ్బాయి చౌదరి, పుప్పాల వాసుబాబు, కొట్టు సత్యనారాయణ, ఎలిజా, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరావు, ముదునూరి ప్రసాద్, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు... జాయింట్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి..హిమాన్స్ శుక్లా...తేజ్ భరత్...జిల్లా పరిషత్ సీఈఓ పి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత పారదర్శికింగా కరోనా నివారణకు చర్యలు చేపట్టాం.కోవిడ్ హాస్పిటల్స్ లో 11, 200మంది సిబ్బందిని వైద్యం అందించడానికి నియమిస్తున్నాం. కరోనా మరణాలు తగ్గించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. జ్వరం వచ్చి.. శ్వాసకోస సమస్యలతో బాధ పడితే...టెస్ట్ ల తో సంబంధం లేకుండా వెంటనే వైద్యం కోసం హాస్పిటల్స్ జాయిన్ చేయాలని జిల్లా అధికారులకు అదేశాలిచ్చామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు నిర్వహణలో ఇతర రాష్ట్రాల కంటే అగ్ర స్థానంలో ఉన్నాం. డాక్టర్ వైస్సార్ టెలీ మెడిసిన్ ద్వారా మందులు పొందిన వారికి ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశించారు. కోవిడ్ హాస్పిటల్స్ భోజనం... పారిశుద్యం..మందులు.. సరఫరా ఎలా ఉన్నాయో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి.. అనే అంశంపై ఏఎన్ఎం లకు మార్గనిర్దేశం చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా రోజుకి 50వేల టెస్ట్ లు చేస్తున్నాం. జిల్లా లో కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్స్ సంఖ్య మరింత పెంచేo దు కు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. జిల్లాలో త్వరలో ఆక్సిజన్ లైన్ బెడ్స్ అధిక సంఖ్యలో పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశిoచాం. వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా హాస్పిటల్స్.. కోవిడ్ కేర్ సెంటర్స్ లో పాజిటివ్ కేసులకు వైద్యం.. భోజన సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. మరో మూడు రోజుల్లో మరి కొంతమంది వైద్య సిబ్బంది నియామకం తో పాటు... హాస్పిటల్స్ బెడ్స్ సంఖ్య పెంపుదల కూడ జరుగుతుంది. ప్రజలు భయపడవద్దు... ఎన్ని వేల కేసులు పెరిగిన సమర్ధవంతంగా ఎదుర్కుకోవడానికి ప్రజలను ఆరోగ్య వంతులుగా తిరిగి వెళ్లేందుకు వేల కోట్లు రూపాయలు ప్రజలు కోసం ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళుతున్నారని అన్నారు.
కోవిడ్ కు చికిత్స అందించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడ ముందుకు రావాలి... ఈ విపత్తు ను ఎదుర్కోవడంలో ప్రవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 104నెంబర్ కు విస్తృత ప్రచారం కల్పించాలి. ప్రతి ఆదివారం జిల్లాలో పూర్తి లాక్ డౌన్ ఏర్పాటు చేసాం. జిల్లాలో కరోనా కేసులు 75 శాతం రికవరీ అవుతున్నా యి. ప్రతి కోవిడ్ హాస్పిటల్ కు జిల్లా ఆఫీసర్స్ ను నోడల్ ఆఫీసర్స్ గా నియమించడం జరిగింది. జిల్లా లోని కోవిడ్ హిస్పిటల్స్ లో 10వేల 600బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు 19కోట్లు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. 14కోట్లు 40లక్షలు రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అళ్ల నాని అన్నారు