విశాఖపట్నం ఆగస్టు 8,
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ద్వజమెత్తారు.గత ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా కాలయాపన చేశారని అన్నారు.ఐదు సంవత్సరాల్లో విశాఖను పర్యాటకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉదయం సింగపూర్, మధ్యాహ్నం చైనా కోసం మాట్లాడేవారని,అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే.. లోకేష్ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు.చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడ్డారు అందుకే 23 సీట్లుకే పరిమితం చేశారని,3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు.ఒకవేళ విశాఖలో రాజధాని వద్దనుకుంటే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయొ చ్చునని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు.