YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు రీ-ఓపెన్.. కేంద్ర మార్గదర్శకాలు రెడీ.!

సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు రీ-ఓపెన్..  కేంద్ర మార్గదర్శకాలు రెడీ.!

న్యూ ఢిల్లీ  ఆగష్టు 8 
స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది.మాయదారి కరోనా వైరస్ కారణంగా జనజీవనం అంతా స్థంబించిపోయింది. అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా కాలేజీలు, స్కూల్స్ మూతపడటంతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది. నూతన విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై అందరి దృష్టి పడింది.ఈ నేపధ్యంలోనే స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది.కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత కార్యదర్శుల బృందం కీలక విషయాలను చర్చించారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆగస్టు 31 తర్వాత చివరిదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు వెల్లడించనుంది. అలాగే విద్యార్థులను క్లాసులకు పంపించాలా.? లేదా.? అనే అంశాలపై తుది నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసింది. ఈ క్రమంలోనే పాఠశాలలకు, విద్యాసంస్థలకు బ్రాడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్(ఎస్ఓపి) జారీ చేయనుంది.జూలైలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఈ ఎస్ఓపీలనే ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అనుకూలంగా లేరని ఆ సర్వే సూచించినప్పటికీ, బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థికంగా బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇక కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు సీనియర్ తరగతుల విద్యార్ధులకు తిరిగి క్లాసులు ప్రారంభించాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించిన మార్గదర్శకాలు ప్రకారం.. పాఠశాలలను తెరిచి దశలవారీగా నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నాయి. మొదటి 15 రోజులు, 10, 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కానుండగా.. తరగతిలోని వివిధ సెక్షన్ల విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడానికి నిర్దిష్ట రోజులు ప్రకటించనున్నారు.ఉదాహరణకు ఒక పాఠశాలలో 10వ తరగతికి నాలుగు సెక్షన్స్ ఉంటే.. ‘ఏ,  సీ సెక్షన్లలో సగం మంది విద్యార్థులు నిర్దిష్ట రోజులలో.. మిగిలిన విద్యార్థులు ఇతర రోజుల్లో వస్తారు. ఇక ఫిజికల్ అంటెండెన్స్ కోసం 5-6 నుండి 2-3 గంటల వరకు పరిమితం చేయనున్నారు. అన్ని పాఠశాలలు షిఫ్టుల పద్దతిలో నడుస్తాయి. ఒక షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు ఉంటే..  మరొకటి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యలో ఒక గంట శానిటైజేషన్ కోసం ఉంటుంది. బోధనా సిబ్బంది, విద్యార్థులు కలిపి 33 శాతం సామర్ధ్యంతో పాఠశాలలను  నడపాలని సూచించారు.ఇదిలా ఉంటే ప్రీ-ప్రైమరీ లేదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కూడా పాఠశాలలకు తిరిగి తీసుకురావాలని కార్యదర్శుల బృందం సూచిస్తోంది. ఆన్‌లైన్ తరగతులను కొనసాగించడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదని వెల్లడించింది. 10 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రవేశపెట్టిన తరువాత.. , 6 నుండి 9వ తరగతి వరకు కూడా నిర్దేశించిన షిఫ్టుల్లో పాఠశాలలు భౌతిక పాఠశాల విద్యను ప్రారంభించాలని సూచించారు.”స్విట్జర్లాండ్ లాంటి దేశాలు పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చిన విధానంపై అధ్యయనం చేశామని.. సరిగ్గా అలాంటి మోడల్ భారతదేశంలో సక్సెస్ అవుతుందని సీనియర్ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అయితే కేంద్రం ఈ విధానాన్ని సిఫార్సు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని.. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

Related Posts