విజయవాడ ఆగష్టు 8
కరోనా దెబ్బకు సినిమాల దుకాణం బంద్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఆ సీనియర్ కమెడియన్ కు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. సినిమాల్లో భవిష్యత్ అడుగంటడంతో రాజకీయాల బాట పట్టారు. పోయినసారే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో తప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వీరలెవల్లో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.. టాలీవుడ్ లో ఎంతో డిమాండ్ ఉన్న సీనియర్ కమెడియన్.. ఆర్టిస్టుగా బిజీగా ఉన్నప్పటికీ ఈ మధ్య విజయవాడకు చక్కర్లు కొడుతున్నాడట.. వైసీపీ పార్టీ ఆఫీస్ చుట్టు తిరుగుతూ వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట.. జనరల్ గా పార్టీ నాయకులు ఏదో రికమండేషన్ కోసం వెళ్తున్నాడని గమ్మున ఉంటున్నారు. కానీ కమెడియన్ అలీ ఎందుకు వెళ్తున్నాడని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట..సీనియర్ కమెడియన్ అలీకి ఎన్నికల ముందు పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ ఇస్తాం అని హామీ ఇచ్చిందట.. దాని కోసం వైసీపీ ఆఫీసు చుట్టూ అలీ తిరుగుతున్నాడని కొంత మంది పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లలో అలీకి ఎమ్మెల్సీ వస్తుందా? లేదో చూడాలి మరీ..గుంటూరులో అసెంబ్లీ సీటు కోసం అలీ ఎన్నికల ముందర వైసీపీలో చేరారు. కానీ సామాజిక సమీకరణాల్లో జగన్ సీటు ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ కావడంతో ఆయా స్థానాల్లో అలీకి అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాడు. సినిమాలు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో రాజకీయాలే బెటర్ అని అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.