తమలపాకులపై దీపాన్నివెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట. ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే... తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా వుండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి ఫింఛం వలె పూజగదికి ముందున్న ఓ టేబుల్‌పై సిద్ధం చేసుకోవాలి.
దానిపై మట్టి ప్రమిదను వుంచి.. తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో వున్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషాలు చేకూరుతాయి...