మనం భగవంతుని జన్మరాహిత్యం కోసమే పూజించాలని పెద్దలు చెబుతారు. కాని దాన్ని మనం ముక్తి అనే పదంతో వాడుతుంటాం.
ముక్తి అనేది *నాలుగు రకాలని* చెబుతారు.
*1. సాలోక్య,*
*2. సామీప్య,*
*3. సారూప్య,*
*4. సాయుజ్య ముక్తులు.*
ఇంతకు ఇవేమిటి అనేది తెలుసుకుందాం.-
*సాలోక్యముక్తి* అంటే భగవంతుడుండే లోకంలో భక్తుడు ఉండడం
*సామీప్య ముక్తి* భగవంతుని ఆంతరంగికులలో చేరి భగవంతుని సమీపంలో ఉండడం
*సారూప్య ముక్తి* ఇది ఒకవిధంగా భగవంతుని ఆకారంలో ఉండడం
*సాయుజ్య ముక్తి* భగవంతుని రూపంతో బాటు భగవందానందం పొందుతూ భగవంతునిలో లీనమవడం.
ముక్తిలో కూడా ఇన్ని విధాలున్నాయి.
మనకే విధమైన ముక్తి కావాలో మనం ఆవిధమైన పద్ధతిని అవలంబించి ఆయనలో చేరాలిమరి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో