YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అక్కరకు రాని వాటర్ షెడ్ పథకాలు

 అక్కరకు రాని వాటర్ షెడ్  పథకాలు

పదేళ్లకు ముందు... గ్రామంలో దారుణమైన పరిస్థితి ఉండేది. ఇప్పటికి పదేళ్లనాడు ప్రభుత్వ వాటర్‌ షెడ్‌ పథకం కింద భూజల సంరక్షణ చర్యలు తీసుకోవడంతో గ్రామస్థుల దశ తిరగడం ప్రారంభించింది. గ్రామ సమీపాన  చెక్‌ డ్యామ్‌లు, రైత్వారీ కుంటలు, ఏటవాలు ప్రాంతాల్లో మట్టి కట్టలు నిర్మించడంతో వాననీరు  భూమిలో ఇంకడం ప్రారంభమైంది. అంతకుముందు  250 అడుగుల లోతులో నీరు పడగా  భూగర్భ జలాలు పెరగడంతో   వంద అడుగుల లోతునే నీరు సమృద్ధిగా వస్తోంది.పొద్దు పొడవక ముందే ప్రతి ఇంటి నుంచీ కూలి కోసం వలస పోయేవారు. చిన్న వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. గ్రామానికి ఎగువన ఎన్నెస్పీ అద్దంకి బ్రాంచి కాలువ, మరో వైపు కొప్పరం మేజరు కాలువ, ఇంకో వైపు పసుమర్రు మేజరు కాలువలు, గ్రామానికి ఆనుకుని 305 ఎకరాల విస్తీర్ణంలో రెండు సాగు నీటి చెరువులూ ఉన్నా సాగు నీరు మాత్రం లభ్యమయ్యేది కాదు. ఆక్రమణలకు గురై చెరువుల రూపురేఖలు మారిపోవడంతో  ఎన్నెస్పీ కాలువలకు నీటిని విడుదల చేసినా నిలువ ఉండేది కాదు. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. 250 అడుగులు వెళ్లినా నీరు పడేది కాదు. దీంతో రైతులు కంది, ఆముదం, పత్తి తదితర వర్షాధార పంటలు వేసేవారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రామ పరిధిలో బీడు దర్శనమిస్తోంది.రైతులు ప్రభుత్వ సహకారంతో పొలాల్లో 450కి పైగా వ్యవసాయ బోర్లు వేశారు. నీరు పుష్కలంగా ఉండటంతో  అత్యధికంగా మిరప, మొక్కజొన్న, బొప్పాయి, మునగ, కూరగాయలు, మల్బరీ, కంది తదితర వాణిజ్య పంటలు చేపట్టి లాభాల పంట పండిస్తున్నారు. ఈ ఏడాదంతా అత్యధికంగా ఈ ఉత్పత్తులను  విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, విశాఖపట్టణం, కర్ణాటక రాష్ట్రంలోని పలు పట్టణాలకు ఎగుమతి చేశారు. కేవలం పచ్చి మిర్చి అమ్మకం వల్ల ఆరు నెలల కాలంలో రూ.కోటికి పైగా ఆదాయం పొందినట్లు రైతులు చెప్పారు.  పండు, ఎండు మిరపకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి.   ఇక్కడ నెలకొల్పిన పట్టు, నాటు కోళ్లు, పౌల్ట్రీ ఫారాలు, నర్సరీలు, పాల డెయిరీలతో ఏడాదికి రూ.60 కోట్ల వ్యాపారం జరగుతున్నట్లు రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

Related Posts