YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మహాత్ముల_హితోక్తులు

మహాత్ముల_హితోక్తులు

సంపద,యవ్వనం, బంధుగణాన్ని చూసి
గర్వించడం తగదు.ఇవన్నీ లిప్త పాటులో
కాలంలో కలిసిపోయేవే.ఈ ప్రపంచ మంతా
'మాయే' అని తెలుసుకో.దీనినుంచి బయట పడాలంటే భగవంతుని పాదాలను
ఆశ్రయించడం తప్ప వేరే మార్గంలేదు.
                              *-ఆది శంకరాచార్య*
నాకు సాక్షాత్కారం కలుగుతుందా అనే సందేహం.నాకు సాక్షాత్కారం కలుగలేదు
అనే భావన-ఇవి రెండూ సాక్షాత్కారానికి
ఆటంకాలు. అదేమీ కొత్తగా పొందేది కాదు. ఆత్మ సాక్షాత్కరించే ఉంది.కావల్సిందల్లా
నాకు సాక్షాత్కారం లేదు అనే తలంపును
తోసి పారేయడమే.
                                  *-రమణ మహర్షి*
మబ్బులు కమ్మిన ఆకాశం ... సూర్యుని
తేజస్సును ఎలాగైతే భూమికి చేరకుండా
అడ్డుకుంటుందో...అదేవిధంగా అహంకారం
నిండిన మనస్సు మనలోని దైవత్వమనే
వెలుగును ప్రసరించనీయదు.
                        *-రామకృష్ణ పరమహంస*
ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. కొత్తగా ఏమీ ఆలోచించకండి. మనసులోకి ఏవో
ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొత్త ఆలోచన వచ్చేలోగా పాతదాన్ని బయటకు
పంపేయండి.ఇలా ప్రయత్నిస్తే కొన్నాళ్ళకు
ఆలోచనారహితమైన నిశ్చలావస్థకు చేరుకుంటారు.
                                          *-అరబిందో*
తోటి వారిని ప్రేమించడం, వారికి సాయపడడం ద్వారా ఉన్నతస్థితికి చేరుకోగలవు. ఎదుటి వారి పట్ల చూపించే కరుణ,దయ ఇవన్నీ ప్రేమే.పవిత్రమైన ప్రేమకు ఎలాంటి గాయాలనైనా మాన్పించే
శక్తి ఉంది. ఎదుటి వారిలో పరమాత్మను
చూడగలగడమే ప్రేమ.
                              *-షిరిడి సాయిబాబా*
ఇది నీ మార్గం...నువ్వు ఒంటరిగా వెళ్ళవలసిన మార్గం.ఇతరులు ఈ మార్గంలో నీతో కలిసి కొంత కాలమే ప్రయాణించవచ్చు.నువ్వు ఎంచుకున్న
మార్గం ఏదైనా... అందులో నీ బదులుగా
వారు ప్రయాణించడం సాధ్యంకాదు.
నీ ప్రయాణంలో చివరి దాకా నీకు నువ్వే తోడు.
                                *-గౌతమబుద్ధుడు*
సత్యమే భగవంతుని స్వరూపం. ఆయనే
సృష్టికర్త.ఆయనకు భయం,ద్వేషం లేవు.
ఆయన కాలానికి అతీతుడు.ఆయనకు
చావు పుట్టుక లు లేవు. ఆయన మూర్తి
తేజోమయం.సద్గురువు బోధ ద్వారా
భగవంతుని పట్ల జ్ఞానం కలుగుతుంది.
                                      *-గురునానక్*
లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.దాని సాధనకై నిరంతరం శ్రమించండి.అదే జీవితంగా
మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి.
కలలు కనండి.మీ శరీరంలో ప్రతియొక్క అవయవాన్ని దాని గురించిన ఆలోచనలతో నింపేయండి.విజయం సాధించడానికి దగ్గరి దారి ఇదే.
                              *-స్వామి వివేకానంద*
జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదు. పుస్తకాలు చదవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం,చదువు పూర్తయింది అనిపించుకోవడంతో సంపూర్ణ జ్ఞానం
సాధించినట్టు కాదు. పుట్టిన క్షణం నుంచి
శరీరాన్ని త్యజించే వరకూ జీవితాంతం
నిరంతరాయంగా కొనసాగాల్సిన ప్రక్రియ.

Related Posts