నిజామాబాద్ ఆగస్టు 10,
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు డిపి గంగారాం తన స్వగ్రామం నల్లవెళ్లి లో ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపు కాసి కర్రలతో బాది హతమార్చారు. ఘటనకు కుటుంబ కలహాలే హత్య కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ తో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.