YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానం ఆరంభం అన్ని ప్రాంతాలలో సమగ్రాభివృద్ధే కొత్త పారిశ్రామిక విధానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానం ఆరంభం అన్ని ప్రాంతాలలో సమగ్రాభివృద్ధే కొత్త పారిశ్రామిక విధానం

అమరావతి, ఆగస్ట్,10
ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పారిశ్రామికాభివృద్ధి విధానం 2020-23” ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా లాంఛనంగా ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదిగేందుకు, అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధిని కాంక్షించేలా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ సరికొత్తగా రూపొందించబడింది. పారిశ్రామిక, విద్యా, ఆర్థిక, వాణిజ్య వేత్తల సమక్షంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా సోమవారం కొత్త పారిశ్రామిక విధానం విడుదలైంది.
అన్ని ప్రాంతాల, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం సమానవృద్ధికి దిక్సూచిగా మారనుంది. పారిశ్రామిక ప్రపంచంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వెన్నుదన్నుగా, వాణిజ్య ఖర్చును తగ్గించే వినూత్న పద్ధతులను అవలంబించనుందీ పాలసీ. 30 నైపుణ్య కళాశాలలను, 2 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యువతీ, యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పారిశ్రామికవేత్తలుగా మలచడం, ఉన్నతమైన జీవన ప్రమాణాలను సృష్టించడం వంటి కీలక విషయాలపై పారిశ్రామిక అభివృద్ధి విధానం దృష్టిసారించనుంది.
సహజ వనరులైన సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతర విద్యుత్ సరఫరా, నీరు, మౌలిక వసతులు, అన్ని ప్రాంతాలతో మన రాష్ట్రం అనుసంధానంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి ఓ వరం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలైన విమానాశ్రాయాలు, పోర్టులు సమృద్ధిగా ఉండడం, అపార నైపుణ్యం కలిగిన మానవవనరులు మరో బలం. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ...వనరులను వినియోగించుకుంటూ పారిశ్రామికాభివృద్ధిలో తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అవసరమైన విధివిధానాలు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో సమ్మిళితమై ఉన్నాయడనంలో ఏ మాత్రం సందేహం లేదు.
పారిశ్రామికరంగంలో కీలకమైన ఔషధ,జౌళి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, పెట్రో కెమికల్ రంగాలతో పాటు కళాత్మక బొమ్మల తయారీ(టాయ్స్), గృహోపకరణాలు (ఫర్నిచర్), ఫుట్ వేర్,లెదర్, మెషినరీ, పనిముట్ల తయారీ,ఏరోస్పేస్, రక్షణ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 2020-23 భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలబెట్టడం ఖాయం.
సాహసోపేతమైన సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధించడానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఈ కొత్త పాలసీ అండగా నిలబడుతుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టడం, నిజమైన మహిళా సాధికారతను సాధించడమే సరికొత్త పారిశ్రామిక విధానం అంతిమలక్ష్యం. రాష్ట్రాభివృద్ధికి మూలాధారమైన 'రెడీ-బిల్ట్ ప్రీ-క్లియర్డ్' సదుపాయాలను సృష్టించడం, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను అందించడంపైనా దృష్టి పెట్టనుంది.

Related Posts