విజయవాడ ఆగస్టు 10,
వేద పాఠశాల అదనపు గదులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సోమవారం శంకుస్థాపన చేసారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి వేద స్మార సేవా సమితి పాఠశాల కు అదనపు గదుల నిర్మాణం కోసం రూ 23 లక్షలు నిధులు మంజూరు అయిన విషయం తెలిసిందే.
మంత్రి మాట్లాడుతూ ఎక్కడ వేదపారయణం జరుగుతుందో అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. పాఠశాల నిర్వహణ కు దేవాదాయ శాఖ నుండి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభివృద్ది కోసం తన వంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం వేద అశ్వీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ పి అర్జనరావు, దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు