హైదరాబాద్ ఆగస్టు 10,
ఈస్ట్ జోన్ చదర్ ఘాట్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీ షీటర్ సయీద్ సాజిద్ చాచు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితులు ఆరురు కలిసి సయీద్ అలియాస్ హత్య చేశారని సుల్తాన్ బజార్ ఏ సి పి దేవేందర్ తెలిపారు. ఏసీపీ మాట్లాడుతూ స్నేహితులు మధ్య పాత కక్షలు, గొడవల వల్ల రౌడీ షీటర్ సయ్యద్ చాచు ను హతమార్చారు. శనివారం రాత్రి చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాంపురా చమన్ వద్ద ఈ హత్య చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత పోలీస్ బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు. సాజిద్ ను ఆరుగురు అతికిరతకంగా కత్తులతో పొడిచి హతమార్చిన నిందితులు పరార్ అయ్యారు. మృతుడు సాజిద్ సయీద్ చాచు పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే మృతుడు సయీద్ చాచు ను చాదర్ ఘాట్ పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరునాడు సయీద్ హతం అయ్యాడు. ఈ కేసును 24 గంటల్లో ఈ కేసు చేధించాం. మొత్తం మూడు టీమ్స్ ఏర్పడి హత్య కేసు చేధించామని ఏసీపీ వెల్లడించారు.